IND Vs AUS Warm-Up Match highlights: దుబాయ్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచ కప్​ వార్మప్​ మ్యాచ్​లో (T20 Warm-Up Match Today) టీమ్​ఇండియా ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియన్​ టీమ్​ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్​ నష్టపోయి ఛేధించింది. ఈ మ్యాచ్​లో(IND Vs AUS Match Today) ప్రత్యర్థి ఆస్ట్రేలియా నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో టీమిండియా పూర్తి చేసింది. ఓపెనర్లు కేఎల్​ రాహుల్ ​(39 పరుగులు), రోహిత్​ శర్మ టీమిండియాకు అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు. రోహిత్​ శర్మ (60) హాఫ్​ సెంచరీ చేసి రిటైర్డ్​ హర్ట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్​ బరిలో దిగిన హార్దిక్​ పాండ్యా (14)తో కలిసి సూర్య కుమార్ ​యాదవ్​(38) (Surya Kumar Yadav) మ్యాచ్​ను పూర్తి చేశాడు.
   
అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు (IND Vs AUS Warm-up Match).. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు నమోదు చేసింది. ఆరంభంలోనే ఓపెనర్లు​ డేవిడ్​ వార్నర్ ​(3), కెప్టెన్​ ఆరోన్​ ఫించ్ ​(8) తక్కువ పరుగులకే అవుట్​ అవ్వగా.. ఆ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన మిచెల్​ మార్ష్​ డకౌట్​గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (37) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. అంతలోనే మ్యాక్స్​వెల్​ అవుట్​ అయిన తర్వాత.. క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టొయినిస్ (41)తో (Marcus Stoinis) కలిసి స్టీవ్‌ స్మిత్ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : James Pattinson Retired: యాషెస్​ సిరీస్​కు ముందు క్రికెట్​ ఆస్ట్రేలియాకు షాక్​.. జేమ్స్​ పాటిన్సన్​ రిటైర్మెంట్​


భువనేశ్వర్‌ కుమార్ వేసిన చివరి ఓవర్లో స్టీవ్ స్మిత్‌ రోహిత్ శర్మకు (Rohit Sharma) క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్స్ దూకుడుగా ఆడటంతో ఆ జట్టు ఓ మోస్తరు పరుగులు చేయగలిగింది.


Also read : Cricket and Duckout: క్రికెట్ చరిత్రలో డకౌట్ కాని క్రికెటర్లు ఎవరో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook