Cricket and Duckout: క్రికెట్ చరిత్రలో డకౌట్ కాని క్రికెటర్లు ఎవరో తెలుసా

క్రికెట్ చరిత్రలో ఒకరిని మించి మరొక బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. పరుగుల వరద సృష్టించడం, సెంచరీలపై సెంచరీలు సాధించడం వీళ్లకు అలవాటే. అయితే తమ క్రికెట్ జీవితంలో ఒక్కసారి కూడా డకౌట్ కాని బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నారని తెలుసా. అటువంటి బ్యాట్స్‌మెన్ నలుగురి గురించి తెలుసుకుందాం.

Cricket and Duckout: క్రికెట్ చరిత్రలో ఒకరిని మించి మరొక బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. పరుగుల వరద సృష్టించడం, సెంచరీలపై సెంచరీలు సాధించడం వీళ్లకు అలవాటే. అయితే తమ క్రికెట్ జీవితంలో ఒక్కసారి కూడా డకౌట్ కాని బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నారని తెలుసా. అటువంటి బ్యాట్స్‌మెన్ నలుగురి గురించి తెలుసుకుందాం.
 

1 /4

కెప్లర్ వెస్సెల్స్( దక్షిణాఫ్రికా) ఇతడు మాత్రం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండు దేశాల తరపున ఆడాడు. కెప్లర్ వెస్సెల్స్ తన పదేళ్ల క్రికెట్ కెరీర్‌లో 109 వన్డే మ్యాచ్ లు ఆడి 3 వేల 367 పరుగులు సాధిచాడు. ఇందులో 26 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఇతడి అత్యధిక స్కోలు 107 పరుగులు. తన కెరీర్‌లో ఎప్పుడూ డకౌట్ కాలేదు.

2 /4

పీటర్ క్రిస్టన్ ( దక్షిణాఫ్రికా) దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాట్స్‌మెన్ పీటర్ క్రిస్టన్ మూడేళ్లపాటు క్రికెట్ ఆడాడు. కానీ ఒక్కసారిగా కూడా జీరోకు అవుట్ కాలేదు. పీటర్ మూడేళ్లలో 40 వన్డేలు ఆడి..1293 పరుగులు సాధించాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలే ఉన్నాయి. ఇందులో ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇతడి అత్యదిక స్కోరు 97 పరుగులు కావడం విశేషం.

3 /4

యశ్‌పాల్ శర్మ ( ఇండియా) ఇండియాకు చెందిన మాజీ క్రికెటర్, బ్యాట్స్‌మెన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. యశ్‌పాల్ శర్మ 42 వన్డే మ్యాచ్‌లు ఆడి 883 పరుగులు సాధించాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డేలో ఇతడి అత్యధిక స్కోరు 89 పరుగులు. ఇండియాకు చెందిన ఈ క్రికెటర్ ఎన్నడూ డకౌట్ కాలేదు. 

4 /4

జాక్స్ రోడల్ఫ్ ( దక్షిణాఫ్రికా) దక్షిణాఫ్రికాకు చెందిన జాక్స్ రోడల్ఫ్ 45 వన్డే మ్యాచ్‌లు ఆడి 1174 పరుగులు సాధించాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలే ఉన్నాయి. ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో జాక్స్ రోడల్ఫ్ అత్యధిక స్కోరు 81 పరుగులు కాగా ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం.