India Vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్.. తుది జట్లు ఇవే..
India Vs Bangladesh 1st Odi Updates: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. రిషబ్ పంత్ తుది జట్టు నుంచి ఔట్ అవ్వగా.. కేఎల్ రాహల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.
India Vs Bangladesh 1st Odi Updates: బంగ్లాదేశ్‌తో టీమిండియా పోరుకు సిద్ధమైంది. రెండు జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం ఉదయం ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఢాకాలోని షేర్ బంగ్లా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత హిట్‌మ్యాన్ తొలిసారి మైదానంలోకి దిగనున్నాడు. తమీమ్ ఇక్బాల్ గాయం తర్వాత బంగ్లాదేశ్‌కు లిటన్ దాస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
టాస్ గెలిచిన లిటన్ దాస్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పిచ్‌లో కొంత తేమ ఉన్నట్లు అనిపిస్తుందని.. తాము కూడా టాస్ గెలిచి ఉండే ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమన్నాడు. టీమ్‌లో కొన్ని గాయాలు, మరికొన్ని సమస్యలతో నలుగురు ఆల్ రౌండర్లు ఆడుతున్నారని చెప్పాడు. వాషింగ్టన్, శార్దూల్, షాబాజ్, దీపక్ చాహర్ తుదిజట్టులో ఉన్నారని.. కుల్దీప్ సేన్ అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. న్యూజిలాండ్‌లో కొంతమంది కుర్రాళ్లు బాగా బ్యాటింగ్ చేశారని అన్నాడు. ప్రపంచ కప్ ఇంకా చాలా దూరంలో ఉందని.. తాము ఇంకా అంత దూరం ఆలోచించడం లేదన్నాడు.
టీమిండియా అనుహ్య మార్పులతో బరిలోకి దిగింది. గత కొంతకాలంగా వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌ను తుది జట్టు నుంచి తప్పించారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. కుల్దీప్ సేన్ ఈ వన్డేలో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. శిఖర్ ధావన్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్
బంగ్లాదేశ్: లిటన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్
Also Read: Draupadi Murmu : ఏపీ పర్యటనకు ద్రౌపది ముర్ము.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!
Also Read: Deepthi Sunaina Hot Photos: బక్కచిక్కిన దీప్తి సునైనా... హీరోయిన్ లా మారిందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook