Indian President Droupadi Murmu Andhra Pradesh Visit Schedule: భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ము మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈరోజు ఉదయం 10:30కు ఆమె విజయవాడ చేరుకోబోతున్నారు. విజయవాడ సమీపాన ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆమె ప్రత్యేక విమానంలో ల్యాండ్ కానున్నారు. ల్యాండ్ అయిన తర్వాత ఆమెను గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ సహా ప్రోటోకాల్ ప్రకారం అధికారులు స్వాగతించనున్నారు, ఇక తర్వాత పోరంకిలో ఆమెకు పౌర సన్మానం జరగనుంది ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముని ఘనంగా సన్మానించబోతున్నారు.
ఇక ఆ తర్వాత గవర్నర్ విశ్వబ్బిషన్ హరిచందన్ రాజ్ భవన్ లో రాష్ట్రపతి రాక సందర్భంగా ఆమె గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొనబోతున్నారు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటలకు ద్రౌపది ముర్ము గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖపట్నం బయలుదేరి వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ లో జరిగే నేవీ డే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అక్కడ భారత నౌకాదళం చేసే విన్యాసాలను వీక్షించడంతో పాటు రక్షణ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు.
ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ రేంజ్, కృష్ణాజిల్లా నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ వంటి వాటిని ఆమె ప్రారంభించబోతున్నారు. ఇక అదే విధంగా కర్నూలు సత్యసాయి జిల్లాలకు సంబంధించిన పలు జాతీయ రహదారుల పనులకు కూడా ఆమె శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ రోజు రాత్రి విశాఖపట్నంలో బయలుదేరి 9:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమల చేరుకొని పద్మావతి అతిథి గృహంలో బస చేయబోతున్నారు. ఇక సోమవారం ఉదయం 9:25 నిమిషాలకు వరాహ స్వామి వారిని ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోబోతున్నారు.
సుమారు 12.35 నిమిషాలకు అలిపిరి గో మందిరం చేరుకుని అక్కడి ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. తర్వాత 12.55 నిమిషాలకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలకు ఆమె అతిథిగా హాజరు కాబోతున్నారు. తర్వాత ఒంటిగంటకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణం కాబోతున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆమె పర్యటించే జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో కూడా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటన మార్గాల్లో శుక్రవారం నుంచి పోలీసులు భద్రతను తమ అదుపులోకి తీసుకున్నారు, చాలా చోట్ల ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Kavitha Flexies: డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్.. కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు!
Also Read: పవన్ కళ్యాణ్ తో సుజీత్ సినిమా.. ఆర్ఆర్ఆర్ తరువాత రంగంలోకి డీవీవీ సంస్థ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook