Ind Vs Ban 2nd Odi Playing 11: బంగ్లాదేశ్‌తో రెండో వన్డేతో టీమిండియా సిద్ధమవుతోంది. బుధవారం మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ ఊహించని విధంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై తేమగా ఉండడంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటుందని అందరూ భావించారు. కానీ లిటన్ దాస్ అనూహ్యంగా మొదట బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. బంగ్లాదేశ్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్‌, కుల్దీప్ సేన్‌ ప్లేస్‌లో స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్‌లో తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి వన్డేలో అనూహ్యంగా ఒక వికెట్ తేడాతో ఓడిపోయిన భారత్‌కు ఈ మ్యాచ్‌ చావోరేవోగా మారింది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ చూస్తుండగా.. టీమిండియాను ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. 


మొదటి వన్డే సెలెక్షన్స్‌కు అక్షర్ పటేల్ దూరమైన సంగతి తెలిసిందే. అక్షర్ స్థానంలో జట్టులోకి వచ్చిన షాబాద్ పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లో డకౌట్ అవ్వగా.. బౌలింగ్‌ తేలిపోయాడు. దీంతో రెండో వన్డేకు అతడిని పక్కన పెట్టింది మేనేజ్‌మెంట్. తొలి వన్డేలో అరంగేట్రం చేసి కుల్దీప్ సేన్ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌ భారత్‌కు చావోరేవోగా మారడంతో తుది జట్టులో ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంది.


ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టాస్ గెలిచిన ముందుగా బౌలింగ్ చేసే వాళ్లమని చెప్పాడు. బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేఊసి.. టార్గెట్ ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి వచ్చాడని.. కుల్దీప్ సేన్ ఎంపికకు అందుబాటులో లేడని చెప్పాడు. అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకున్నామని తెలిపాడు. 


'మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మంచి వికెట్‌గా కనిపిస్తోంది. చివరి గేమ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టమని చూశాం. హసన్ మహమూద్ స్థానంలో నజూమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాం..' అని బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ తెలిపాడు.  


తుది జట్టు ఇలా..


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్


బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్(కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్.


Also Read: Ind Vs Ban Updates: ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. బంగ్లా హిస్టరీ రిపీట్ చేస్తుందా..?  


Also Read: Ind Vs Ban 2nd ODI: నేడే రెండో వన్డే.. భారత్‌కు చావోరేవో.. ఆ ప్లేయర్‌కు ప్లేస్ కన్ఫార్మ్..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి