Virat Kohli: ఫామ్‌లో విరాట్ కోహ్లీ.. అందులోనూ అడిలైడ్‌లో అద్భుత రికార్డ్స్! బంగ్లాదేశ్‌కు చుక్కలే ఇగ
IND vs BAN: Fans Happy with Virat Kohli Adelaide records. అడిలైడ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత రికార్డ్స్ బంగ్లాదేశ్‌ను భయపెడుతున్నాయి.
Former India captain Virat Kohli Adelaide records scares Bangladesh: ఆసియా కప్ 2022తో ఫామ్ అందుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో పరుగుల వరద పారిస్తున్నాడు. పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ (82 నాటౌట్) ఆడిన విరాట్.. నెదర్లాండ్స్‌పై (62 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే దక్షిణాఫ్రికాపై (12) మాత్రం కాస్త తడబడ్డాడు. మూడు మ్యాచ్‌లలో కోహ్లీ 156 రన్స్ చేశాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగే కీలక మ్యాచులో కూడా చెలరేగాలని అందరూ కోరుకుంటున్నారు. అడిలైడ్‌లో విరాట్ అద్భుత రికార్డ్స్ చూస్తే.. అందరి ఆశలు నెరవేరేలా ఉన్నాయి.
విరాట్ కోహ్లీ అడిలైడ్ రికార్డ్స్ చాలా బాగున్నాయి. అడిలైడ్‌లో కోహ్లీ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 9 మ్యాచ్‌లు ఆడాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 843 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 141. అడిలైడ్‌లో ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ.. ఏకంగా 90 పరుగులతో అజేయంగా నిలిచాడు. అడిలైడ్‌లో కోహ్లీ 84.30 సగటుతో పరుగులు చేశాడు. ఈ రికార్డ్స్ భారత అభిమానులను సంతోషపరుస్తున్నాయి. బంగ్లాదేశ్‌కు చుక్కలే ఇగ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం. సెమీస్ రేసులో నిలవాలంటే రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. టీమిండియాతో పోలిస్తే బంగ్లాదేశ్ చిన్న జట్టే అయినా.. ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. 2016 టీ20 ప్రపంచకప్‌లో ధోనీ సేనను బంగ్లా ఓడించినంత పనిచేసింది. మరోవైపు బంగ్లా కెప్టెన్ కూడా ఈరోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఆదివారం దక్షిణాఫ్రికాపై భారత్ ఓడిపోవడంతో గ్రూప్ 2 రేసు రసవత్తరంగా మారింది. గ్రూప్ 2లో 5 పాయింట్లతో దక్షిణాఫ్రికా టాప్‌లో ఉండగా.. భారత్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా 4 పాయింట్లతో ఉన్నప్పటికీ.. రన్‌రేట్ కారణంగా మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ చేరాలంటే.. బంగ్లాపై గెలవడంతో పాటు జింబాబ్వేను ఓడించాలి. ఈ రెండింటిలో ఒక్కటి ఓడినా.. వర్షంతో రద్దయినా భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
Also Read: జహీర్ ఖాన్ రెస్టారెంట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం.. గంటన్నర తర్వాత అదుపులోకి మంటలు!
Also Read: గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసుండరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook