Ind Vs Ban Highlights: వరల్డ్ కప్ 2023లో టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (103) సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్ (53), కెప్టెన్ రోహిత్ శర్మ (48), కేఎల్ రాహల్ (34 నాటౌట్) రాణించారు. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మ్యాచ్‌తో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్.. పాకిస్థాన్‌ మ్యాచ్‌తో వరల్డ్ కప్‌తో తన తొలి మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే బంగ్లాదేశ్‌పై చూడచక్కని షాట్లతో అలరించాడు. అవతలి ఎండ్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌కు పోటీగా సిక్సర్లు, ఫోర్లు బాదాడు. ఇక మ్యాచ్ ఏడో ఓవర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 


ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ విచ్చేసింది. హసన్ మహ్మద్ వేసిన ఏడో ఓవర్‌లో గిల్ ఓ ఫోర్ కొట్టాడు. వెంటనే స్టేడియం వద్ద ఉన్న కెమెరామెన్ సారా వైపు కెమెరాను ఫోకస్ చేశాడు. ఆమె చప్పట్లతో గిల్‌ను ఉత్సాహపరిచింది. కాగా.. గతంలో శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని టాక్ నడిచింది. అయితే ఈ విషయంపై ఇద్దరు స్పందించలేదు. 


 




 
ఈ ప్రపంచకప్‌లో శుభ్‌మన్‌ గిల్ టీమిండియాకు కీలకం కానున్నాడు. ఈ ఏడాది ఐదు సెంచరీలు బాది సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇందులో న్యూజిలాండ్‌పై సాధించిన డబుల్ సెంచరీ కూడా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి తోడు గిల్ కూడా రాణిస్తుండడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా మారింది. టాప్-3 ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే.. టీమిండియా వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


ఇది కూడా చదవండి: IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం..


ఇది కూడా చదవండి: Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook