KL Rahul-Virat Kohli: కేఎల్ రాహుల్ ఫ్లాఫ్ షో.. రంగంలోకి దిగిన విరాట్ కోహ్లీ!
Virat Kohli turns as a Coach for KL Rahul ahead of Bangladesh clash in T20 World Cup 2022. ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ సాయం తీసుకుంటున్నాడు.
Virat Kohli Gives valuable suggestions to KL Rahul ahead of Bangladesh clash in T20 World Cup 2022: ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. టీ20 ప్రపంచకప్ 2022లో దారుణంగా విఫలమవుతున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా డబుల్ డిజిట్ అందుకోలేదు. పాకిస్థాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై వరుసగా 4, 9, 9 రన్స్ చేశాడు. దాంతో రాహుల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వైస్ కెప్టెన్సీ హోదాలో ఉన్నా.. ఫామ్‌లో లేకుంటే జట్టు నుంచి తప్పించాల్సిందే అంటూ మాజీలు ఇప్పటికే హెచ్చరించారు.
సూపర్ 12లో భాగంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన టీమిండియా.. దక్షిణాఫ్రికాపై మాత్రం ఓటమిపాలైంది. దాంతో గ్రూప్ 2 రేసు రసవత్తరమైంది. సెమీ ఫైనల్ రేసులో దక్షిణాఫ్రికా, భారత్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్ రోహిత్ సేనకు చాలా కీలకంగా మారింది. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే.. ఓపెనర్లు రాణించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోవడం జట్టుకు అత్యవసరం. ఈ క్రమంలోనే అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ సాయం తీసుకుంటున్నాడు రాహుల్.
బంగ్లాదేశ్ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం అడిలైడ్ వేదికగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్ జోరుగా సాగింది. ప్రాక్టీస్ సందర్భంగా లోకేష్ రాహుల్‌తో విరాట్ కోహ్లీ చాలా సేపు మాట్లాడాడు. బ్యాటింగ్ మెళకువలు చెప్పాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను ఎలా ఆడాలో చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి కోహ్లీ చెప్పిన మెళుకువలు రాహుల్ పాటిస్తాడో లేదో చూడాలి. ఆడిలైడ్ వేదికగా రేపు మధ్యాహ్నం 1.30కు భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read: జహీర్ ఖాన్ రెస్టారెంట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం.. గంటన్నర తర్వాత అదుపులోకి మంటలు!
Also Read: గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి సురేష్.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసుండరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook