IND vs BAN, Virat Kohli scores Most Runs On Australian Soil: ఆసియా కప్ 2022తో ఫామ్‌ అందుకున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో అదరగొడుతున్నాడు. బౌలర్ ఎవరైనా, టీమ్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ (82) ఆడిన కోహ్లీ.. నెదర్లాండ్స్‌పై (62) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా (12)పై కాస్త నిరాశపరిచినా.. బంగ్లాదేశ్‌పై (64) చెలరేగాడు. సూపర్ 12లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచులో 220 రన్స్ బాదాడు. బంగ్లాపై హాఫ్ సెంచరీ బాదిన కోహ్లీ.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌లో అ‍త్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 16 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉన్నపుడు ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనే పేరిట ఈ రికార్డు ఉంది. జయవర్ధనే  31 మ్యాచ్‌ల్లో 1016 పరుగులు చేశాడు. కెరీర్‌లో ఐదో టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న కోహ్లీ.. ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి 1065 పరుగులు బాదాడు.


అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలోనూ విరాట్ కోహ్లీ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 113 టీ20 మ్యాచ్‌లు ఆడి 3932 పరుగులు చేశాడు. 146 మ్యాచ్‌ల్లో 3811 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై  అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గానూ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్‌లలో కలిపి 3350 పరుగులు చేశాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆస్ట్రేలియాలో 3300 పరుగులు చేశాడు. 


టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక 'మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌' అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. బంగ్లాతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన విరాట్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌కి ఇది ఏడో మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లలో మూడు లేదా అంతకంటే ఎక్కువ అర్ధ సెంచరీలు చేయడం మూడోసారి. 2014, 2016, 2022 ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ విరాట్ ఈ ఘనత సాధించాడు. 


Also Read: Mahesh - Trivikram: మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య వివాదం.. అసలు ఏమైందంటే?


Also Read: అంచనాలు పెంచేస్తున్న కేడీ.. హిట్ 2 టీజర్ టాక్.. యత్ర నార్యస్తు పూజ్యంతే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook