Jasprit Bumrah: మూడో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. రాజ్‌కోట్ టెస్టుకు బుమ్రా దూరం..!
Jasprit Bumrah: వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్ ను ఓడించడంలో కీలకపాత్ర పోషించిన బుమ్రా.. మూడో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Ind vs Eng 03rd Test Updates: వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్ ను మట్టికరిపించిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రానే ‘'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’' అవార్డు వరించింది. ఈనెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో మ్యాచ్ జరగనుంది. రాజ్‌కోట్ టెస్టుకు ఇంకా పది రోజుల టైం ఉంది. అయితే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా.. బుమ్రాకు మూడో టెస్టులో విరామమివ్వనున్నట్టు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో సిరాజ్ ఆడే అవకాశం ఉంది.
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ తోపాటు కొన్ని మేజర్ టోర్నమెంట్స్ ఉన్న నేపథ్యంలో బుమ్రాను ఫ్రెష్‌గా ఉంచేందుకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 32 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా తొమ్మిది వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు, సెకండ్ ఇన్నింగ్స్ లోమూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు జట్టును మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. గాయంతో రెండో టెస్టుకు దూరమైన రాహుల్.. మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
కోహ్లీ కూడా డౌటే..
వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు అందుబాటులో ఉంటాడో లేదో అనేది అనుమానమే. విరాట్ కోహ్లీ త్వరలో తండ్రి కాబోతున్నడని ఇప్పటికే ఏబీ డివిలియర్స్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సమయంలో తన భార్య దగ్గర కోహ్లీ ఉండటం చాలా అవసరం. ఈ నేపథ్యంలో చివరి మూడు టెస్టులకు విరాట్ ఆడటంపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: WTC Points Table: వైజాగ్ టెస్టులో భారత్ విజయభేరి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మన స్థానం ఎంతంటే?
Also Read: Ravichandran Ashwin: వైజాగ్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. రేర్ ఫీట్ సాధించిన అశ్విన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook