IND vs ENG 2nd Test live Updates: వైజాగ్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా అరుదైన ఘనతను సాధించాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin). టెస్టుల్లో ఇంగ్లండ్(England)పై అత్యధిక వికెట్లు (96) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. రెండో టెస్టులో ఓలీ పోప్ వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్ ను సాధించాడు. అశ్విన్ కంటే ముందు ఈ రికార్డు స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్ (95 వికెట్లు) పేరిట ఉండేది. ఇప్పుడు దానిని అశ్విన్ బద్దలుకొట్టాడు.
ఇంగ్లండ్‌పై 92 వికెట్లతో అనిల్ కుంబ్లే మూడో స్థానంలోనూ... బిషన్‌సింగ్ బేడీ, ఆల్‌రౌండర్ కపిల్ దేవ్(Kapil Dev)లు 85 వికెట్లతో నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఇషాంత్ శర్మ 67 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ మరో వికెట్ తీస్తే 500 వికెట్ల క్లబ్‌లో చేరుతాడు. వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పెద్దగా ప్రభావం చూపని అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కీలకమైన మూడు వికెట్లు తీసి భారత్ కు విజయాన్ని అందించాడు. ఇతడు బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్ వికెట్లను తీశాడు.
ఉప్పల్ టెస్టులో ఎదురైన పరాభవానికి వైజాగ్ టెస్టులో రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది. నాలుగో రోజు భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 292 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో భారత్ 106 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు.
Also Read: Virat Kohli: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట.. క్లారిటీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్!
Also Read: SL vs AFG: క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే క్యాచ్ పట్టిన సమరవిక్రమ, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook