KL Rahul Injury Update: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే రాజ్ కోట్ టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మూడో టెస్టుకు సీనియర్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. రాహుల్ ను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో కర్ణాటకకు చెందిన లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైజాగ్ టెస్టుకు దూరమైన రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మూడో టెస్టు నుంచి తప్పించింది జట్టు మేనెజ్ మెంట్. అతడు 90 శాతం మాత్రమే కోలుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. రాహుల్ ను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. 


ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల సీనియర్ బ్యాటర్ కోహ్లీ సిరీస్ మెుత్తానికి దూరం కాగా.. వరుసగా విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్ ను మిగతా మూడో టెస్టులకు తప్పించారు. సీనియర్లు పూజారా, రహానేలను ఎంపిక చేయలేదు. ఇప్పుడు రాహుల్ కూడా జట్టు దూరమవ్వడంతో టీమిండియా బ్యాటింగ్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న తెలుగు ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ స్థానంలో మూడు టెస్టులో ధ్రువ్‌ జురెల్‌ ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రేయస్ స్థానంలో రాజ్‌కోట్‌లో సర్ఫారాజ్‌ ఖాన్‌ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది.


Also Read: World Cup: చిన్న కప్పును కూడా తన్నుకుపోయిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో భారత్‌కు నిరాశ


Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి