Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Kim Watson Unborn Child: తల్లిదండ్రులు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఒకసారి వచ్చినట్టు వచ్చి మళ్లీ రాకుండాపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇలాంటి పరిణామం తనకు ఎదురవడంతో స్టార్‌ క్రికెట్‌ కన్నీటి సంద్రంలో మునిగాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 10, 2024, 11:46 PM IST
Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Devon Conway Wife Miscarriage: తన భార్య గర్భ విచ్ఛేదనం జరిగిందని.. ఇలాంటి పరిణామం ఎదురుకావడం బాధగా ఉందని న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవాన్‌ కాన్వే సతీమణి కిమ్‌ వాట్సన్‌ తెలిపింది. ఆవేదనపూరితంగా తొలిసారి తన జీవితంలోని వ్యక్తిగత విషయాన్ని బాహ్య ప్రపంచానికి పంచుకుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు పంచుకోవడానికి ఇష్టపడను అని చెబుతూనే పంచుకోవడం గమనార్హం. కడుపులో పాప పుట్టకుండానే మరణించిందని చెప్పి ఆవేదనకు లోనయ్యింది. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్టు చేస్తూ మహిళలకు ఇలాంటి సున్నిత.. విపత్కర పరిస్థితులపై అవగాహన కల్పిస్తూ పోస్టు చేసింది. మళ్లీ తమకు పాప పుడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదని స్పష్టం చేసింది. కాగా ఇలా జరగడంపై డేవాన్‌ కాన్వే కూడా తీవ్ర ఆవేదనకు లోనయ్యాడని తెలుస్తోంది. కొన్నాళ్లుగా అందరికీ దూరంగా ఉన్నారని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Lottery: పిల్లల పేర్లతో నాన్నకు వరించిన అదృష్టం.. రూ.33 కోట్ల లాటరీ సొంతం

'నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడను. కానీ గర్భస్రావం వల్ల నాలాంటి ఎంతోమంది స్త్రీలు ఎంతటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. ఈ విషయాన్ని పంచుకోవడానిక నేనేమీ బాధపడడం లేదు. సిగ్గు కూడా పడడం లేదు. నాలాగే ఏ మహిళాకైనా ఇలాంటి కఠిన పరిస్థితి ఎదురైతే ఆమె గుండె ముక్కలైతే తట్టుకునే శక్తి ఉండాలి. కదా! దీనికోసమే నా మనసులోని భావాలను ఈ విధంగా పంచుకుంటున్నా' అని కాన్వే భార్య కిమ్‌ వాట్సన్‌ తెలిపింది.

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

'ఏదో ఒకరోజు మా జీవితాల్లో మళ్లీ అద్భుతం జరుగుతుంది. తను మళ్లీ తిరిగి వస్తే బోలెడంత ప్రేమను పంచేందుకు మేము సిద్ధంగా ఉంటాం' అంటూ కిమ్‌ వాట్సన్‌ పోస్టు చేసింది. ఈ సందర్భంగా భావోద్వేగ కవితను కిమ్‌ కాన్వే పంచుకుంది. అందులో 'అమ్మానాన్న ప్లీజ్‌ ఏడవద్దు' అనే వాక్యం భావోద్వేగానికి లోను చేసింది. ఈ పోస్టు చూసిన చాలా మంది సానుభూతి తెలిపారు. 'మీకు తప్పకుండా మళ్లీ పిల్లలు పుడతారు. బాధపడకండి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె చేసిన పోస్టుకు నెటిజన్ల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. కాన్వే, కిమ్‌ను ఓదార్చుతూ అభిమానులు సందేశాలు పంపుతున్నారు.

డావిన్‌ కాన్వే, కిమ్‌ కాన్వేది ప్రేమ వివాహం. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ 2020లో నిశ్చితార్థం చేసుకోగా.. 2022లో దక్షిణాఫ్రికాలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం న్యూజిల్యాండ్ జట్టు తరఫున కాన్వే కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతేకాదు మన ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్న కాన్వే గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. సీఎస్‌కే మరోసారి ట్రోఫీ గెలవడంలో కాన్వే కూడా శ్రమించాడు.

 
 
 
 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News