Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో జైస్వాల్.. ధర్మశాల టెస్టులో నెరవేరుతుందా?
Ind vs Eng 05th test: మార్చి 07 నుంచి ధర్శశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మెుదలుకానుంది. ఈ క్రమంలో టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్ పలు రికార్డులపై కన్నేశాడు.
Yashasvi Jaiswal latest: టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఓ రేంజ్ లో దుమ్మురేపుతున్నాడు. ఇతడి ఆటకు రికార్డులన్నీ దాసోహమవుతున్నాయి. ఈసిరీస్ లోనే ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు ఈ యంగ్ ప్లేయర్. కేవలం నాలుగు టెస్టుల్లోనే 655 పరుగులు చేశాడంటే అతడి విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇతడు మరో రికార్డుపై కన్నేశాడు.
వారిద్దరి రికార్డులపై జైస్వాల్ గురి..
ధర్మశాలలో జరగబోయే ఐదో టెస్టులో జైస్వాల్ మరో 98 పరుగులు చేస్తే.. భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో ఎక్కువ పరుగుల చేసిన ఆటగాడిగా నిలుస్తారు. ఈ రికార్డు ప్రస్తుతం ఇంగ్లండ్ లెజండ్ గ్రాహం గూచ్ పేరిట ఉంది. 1990లో మూడు మ్యాచ్‌లు ఆడి 6 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 125.33 సగటుతో 752 పరుగులు సాధించారు గూచ్. 34 ఏండ్లు అయినా ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. గతంలో జోరూట్ దగ్గరికీ వచ్చినప్పటికీ ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. 2021-22 ఇండియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఐదు టెస్టులు ఆడి (9 ఇన్నింగ్స్‌లలో) 737 పరుగులు చేశాడు రూట్. ఈ లిస్ట్ లో 655 రన్స్ తో యశస్వి మూడో స్థానంలో ఉన్నాడు. ధర్మశాల టెస్టులో మరో 83 పరుగులు చేస్తే జైస్వాల్.. రూట్ రికార్డును బద్దలుగొడతాడు. ఇంకో 98 రన్స్ చేస్తే గూచ్ రికార్డును తుడిచిపెట్టేయడమే కాకుండా.. ఇరు జట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఫ్లేయర్ గా నిలుస్తాడు.
గవాస్కర్ రికార్డుపై కన్ను…
ఇంగ్లండ్ తో జరగబోయే ఐదో టెస్టులో మరో 120 పరుగులు చేస్తే ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డు నెలకొల్పుతాడు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్ పై 4 టెస్టుల సిరీస్‌లో 774 పరుగులు చేశాడు. రెండో స్థానం కూడా ఆయనదే. ఇక 692 రన్స్ తో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.
Also Read: Team India squad: బుమ్రా ఇన్.. రాహుల్ ఔట్... ఐదో టెస్టుకు భారత జట్టు ఇదే..!
Also Read: IPL 2024 Tickets: ఐపీఎల్ 2024 మ్యాచ్ టికెట్ల బుకింగ్ ప్రారంభం ఎలా బుక్ చేసుకోవాలి, ధర ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook