IND Vs ENG 1st Innings Updates: వరల్డ్ కప్‌లో టీమిండియా తొలిసారి తడపడింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతోపాటు క్రమతప్పకుండా వికెట్లు తీయడంతో భారత్ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (87) సెంచరీని చేజార్చుకోగా.. సూర్యకుమార్ యాదవ్ (49) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ (39) రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు, మార్క్ వుడ్ ఒక వికెట్ తీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్ ఆరంభించింది. ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్ (9)ను క్రిస్ వోక్స్ క్లీన్ బౌల్డ్ చేయగా.. విరాట్ కోహ్లీని డేవిడ్ విల్లీ డకౌట్ చేశాడు. కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ (4)ను కూడా వోక్స్ ఔట్ చేయడంతో 11.5 ఓవర్లలో 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్ ఇబ్బందుల్లో పడింది. 


కేఎల్ రాహుల్‌తో జతకట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ మరో వికెట్ పడకుండా జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు సింగిల్స్ తీస్తునే.. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ (39) భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 131 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. మరో ఎండ్‌లో జోరు ప్రదర్శించిన హిట్‌మ్యాన్.. ఫోర్లు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద లివింగ్‌స్టోన్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగుల చేశాడు రోహిత్ శర్మ. కాసేటికే జడేజా (8)ను రషీద్ ఔట్ చేయడంతో 183 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.


చివర్లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49, 4 ఫోర్లు, ఒక సిక్సర్) ప్రయత్నించి ఔట్ అయ్యాడు. బుమ్రా (16) చివరి బంతికి రనౌట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ (9) నాటౌట్‌గా నిలిచాడు. చివరికి 50 ఓవర్లలో టీమిండియా 229 పరుగులు చేసింది. 230 రన్స్ టార్గెట్‌తో ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది.


Also Read: Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. నాగం జనార్థన్‌ రెడ్డి రాజీనామా  


Also Read: Virat Kohli: ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. విరాట్ కోహ్లీ డకౌట్.. వీడియో చూశారా..!   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook