Jasprit Bumrah Registers Best bowling figures by an Indian Pacer in England: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పదునైన బంతులు వేస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. జేసన్‌ రాయ్‌ (0), జానీ బెయిర్‌స్టో (7), జో రూట్‌ (0), లియామ్ లివింగ్‌స్టోన్‌ (0), బ్రైడన్ కార్సె (15), డేవిడ్ విల్లే (21)లను బుమ్రా ఔట్ చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో కెరీర్ బెస్ట్ గణాంకాలు (6/19) నమోదు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్‌ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ (6/19) ప్రదర్శన కనబర్చిన తొలి భారత టీమిండియా పేసర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. 2003లో వెటరన్ పేసర్ ఆశిష్‌ నెహ్రా (6/23) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 2018లో నాటింగ్‌హమ్‌ వేదికగా ఇంగ్లండ్‌ జట్టుపై 6/25తో మెరిశాడు. దాంతో బుమ్రా ఇంగ్లండ్‌ గడ్డపై చరిత్ర నెలకొల్పాడు. 


మొత్తంగా ఇంగ్లండ్‌ గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో పేస్‌ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఇంతకముందు వకార్‌ యూనిస్‌ (2001లో లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌పై 7/36), విన్‌స్టన్‌ డేవిస్‌ (1983లో లీడ్స్‌ వేదికగా ఆస్ట్రేలియాపై 7/51), గారీ గాలిమోర్‌ (1975లో ఇంగ్లండ్‌పై 6/14) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. 


మరోవైపు భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన టీమిండియా బౌలర్‌గా స్టువర్ట్ బిన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. 2014లో మిర్పూరులో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో బిన్నీ 4 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. 1993లో కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో అనిల్ కుంబ్లే 12 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీశాడు. 2022లో ఓవల్లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో జస్ప్రీత్ బుమ్రా 19 పరుగులకు 6 వికెట్స్ పడగొట్టాడు. 2003లో డర్బన్లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఆశిష్ నెహ్రా 23 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీశాడు.


Also Read: Jasprit Bumrah Record: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. స్టువర్ట్ బిన్నీ తర్వాత!


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే  


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook