Today Gold and Silver Rates in Hyderabad: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఉన్న డిమాండ్.. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ.. డాలర్ విలువ.. వివిధ దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు కాబట్టి ధరలు పెరిగినా లేదా తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే ఉంటాయి.
ఇటీవలి కాలంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. వారం రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. నేడు స్వల్పంగా తగ్గాయి. సోమవారం (జులై 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,800లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,054లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 150.. 24 క్యారెట్ల ధరపై రూ. 156 తగ్గింది. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 62,500లుగా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,054గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,054గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,950 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,850.. 24 క్యారెట్ల ధర రూ. 51,100గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,054గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,054గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 46,800.. 24 క్యారెట్ల ధర రూ. 51,054గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,054 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 62,500లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 62,500లుగా కొనసాగుతోంది.
Also Read: ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగల ప్రేమే ఎంతో గొప్పది: నాగ చైతన్య
Alos Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook