Rohit Sharma 79 metre six injures little girl in stands: ఇంగ్లండ్ గడ్డపై భారత్ జోరు కొనసాగుతోంది. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొని మంచి ఊపులో ఉన్న భారత్‌.. మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6/19) ఇంగ్లీష్ బ్యాటర్ల భారతం పడితే.. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. రోహిత్ 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే భారత కెప్టెన్ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియంలోని చిన్నారికి తాకింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లే వేసిన 5వ ఓవర్‌లోని మూడో బంతిని రోహిత్ శర్మ పుల్ షాట్‌తో భారీ సిక్సర్ బాదాడు. ఈ సిక్సర్ 79 మీటర్ల దూరం వెళ్లి స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. ఆ బంతి కాస్త మ్యాచ్ చూసేందుకు తన తండ్రితో వచ్చిన చిన్నారికి బలంగా తాకింది. వెంటనే ఆ చిన్నారి నొప్పితో విలవిలలాడింది. దాంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు, కామెంటేటర్లు ఆందోళనకు గురయ్యారు. కొంతసేపు మ్యాచ్ ఆపేసి చిన్నారి పరిస్థితిపై ఆరా తీసారు. రోహిత్ కూడా ఏమైందో అని టెన్షన్ పడ్డాడు.



అయితే చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుసుకున్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మ్యాచ్‌ కొనసాగింది. ఇంగ్లండ్ ఫిజియోలు చిన్నారికి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి గాయంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'హమ్మయ్య.. చిన్నారి ఏం  కాలేదు', 'చిన్నారికి పెను ప్రమాదం తప్పింది' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు చిన్నారికి తగలకుండా బంతిని పట్టుకోకుండా ఏం చేస్తున్నారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ప్రేక్షకులకు సైగలు చేసిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. 



Also Read: TS Polycet 2022: తెలంగాణ పాలిసెట్‌ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం ఇలా చేయండి!


Also Read: గురు పూర్ణిమ నాడు ఇంద్రయోగం.. మీ గురు దోషాన్ని ఈ నివారణలతో తొలగించుకోండి!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook