TS Polycet 2022: తెలంగాణ పాలిసెట్‌ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం ఇలా చేయండి!

Telangana Polycet 2022 Results released. తెలంగాణ పాలిసెట్‌ 2022 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. బుధవారం రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 13, 2022, 02:19 PM IST
  • తెలంగాణ పాలిసెట్‌ 2022 ఫలితాలు విడుదల
  • రిజల్ట్స్‌ కోసం ఇలా చేయండి
  • జూన్‌ 30న పరీక్ష
TS Polycet 2022: తెలంగాణ పాలిసెట్‌ 2022 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం ఇలా చేయండి!

Telangana Polycet 2022 Results out: తెలంగాణ పాలిసెట్‌ 2022 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. బుధవారం (జులై 13) ఉదయం రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను జూన్‌ 30న నిర్వహించిన సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్‌ డిప్లొమా, అగ్రికల్చర్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌ సీట్లను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 365 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్‌ 2022 పరీక్షను జూన్‌ 30న అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,13,974 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,04,432 మంది హాజరు అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 91.62 శాతం విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ (www.polycetts.nic.in)లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

రిజల్ట్స్‌ కోసం ఇలా చేయండి:
# మొదటగా అధికారిక వెబ్‌సైట్‌ (www.polycetts.nic.in)లోకి వెళ్లండి
# అటెన్షన్‌ టు క్యాండిడెట్స్‌లో డౌన్‌లోడ్‌ పాలిసెట్‌ 2022 రిజల్ట్స్‌పై క్లిక్‌ చేయండి
# క్యాండిడెట్‌ లాగిన్‌ పేజ్‌ ఓపెన్ అవుతుంది
# క్యాండిడెట్‌ లాగిన్‌ పేజ్‌లో రోల్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌ నొక్కండి
# ఫలితాలు స్క్రీన్‌పై వస్తాయి
# హార్డ్ కాపీ కావాలంటే ప్రింట్ ఆప్షన్ క్లిక్‌ చేయండి

Also Read: డేటింగ్ చేస్తామంటూ.. విజయ్ దేవరకొండ కోసం కొట్టుకుంటున్న బాలీవుడ్ యువ హీరోయిన్స్!

Also Read: TELANGANA EAMCET 2022: బ్రేకింగ్.. తెలంగాణ ఎంసెట్ పరీక్షలపై క్లారిటీ.. వాయిదా వేస్తున్నట్టు ప్రకటన.. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News