IND vs ENG 2nd Test: ముగిసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 255 పరుగులకే కుప్పకూలింది. గిల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. తద్వారా ఇంగ్లండ్ ముందు టీమిండియా 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది
IND vs ENG 2nd Test Live Score: వైజాగ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత్. సెకండ్ ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్ (104) సెంచరీతో ఆకట్టుకోగా.. మిగతా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. అక్షర్ పటేల్ 45 పరుగులు చేయగా.. శ్రేయాస్ అయ్యర్, అశ్విన్ చెరో 29 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్ 17 పరుగులకే ఔటవ్వగా.. కెప్టెన్ రోహిత్ 13 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. సొంతగడ్డపై టెస్టు ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ (6) మరోసారి విఫలమయ్యాడు.
అశ్విన్ తర్వాత వచ్చిన ముగ్గురు లోయరార్డర్ బ్యాటర్లు (కుల్‌దీప్, బుమ్రా, ముకేశ్ కుమార్)లు సున్నా పరుగులకే ఔటవ్వడం రోహిత్ సేనను దెబ్బతీసింది. . ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హర్ట్లీ నాలుగు వికెట్లు తీయగా... రిహాన్ అహ్మద్ మూడు వికెట్లు, అండర్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. అసలే బజ్ బాల్ అంటూ భారీస్కోర్లను సైతం అలవోకగా ఛేదిస్తోన్న ఇంగ్లండ్ ను టీమిండియా బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం తేలడం పక్కాగా కనిపిస్తోంది. మరి ఇంగ్లండ్ టార్గెట్ ను ఛేదిస్తోందా లేదా టీమిండియా బౌలర్లకు దాసోహమవుతుందో చూడాలి.
Also Read: IND vs ENG Live: ముచ్చటగా మూడో సెంచరీ చేసిన గిల్.. టీమిండియాకు భారీ ఆధిక్యం..
దూకుడుగా ఇంగ్లండ్..
మూడో రోజు ఇంకా 16 ఓవర్లు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్ ను ప్రారంభించింది. ఓపెనర్లు క్రాలే, డకెట్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ఆశ్విన్ విడదీశాడు. 50 పరుగుల వద్ద డకెట్ ను పెవిలియన్ కు చేర్చాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రాలే, అహ్మద్ ఉన్నారు. ఇంగ్లీష్ జట్టు గెలవాలంటే ఇంకా 332 పరుగులు చేయాలి.
Also Read: Virat Kohli: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట.. క్లారిటీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook