virat kohli-anushka sharma expecting second child: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకే ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. ఈ విషయాన్ని కోహ్లీ ప్రెండ్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలీయర్స్ సోషల్ మీడియా వేదికగా శనివారం వెల్లడించాడు. తాజాగా యూట్యూబ్ లైవ్‌లో ఏబీ డివిలియర్స్ అభిమానులతో ముచ్చటిస్తూ.. విరాట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. విరుష్క దంపతులకు త్వరలో రెండో సంతానం కలుగబోతుందని.. అందుకే కోహ్లీ ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు ఆడటం లేదని ఏబీ చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ తన ఫ్యామిలీతో ఉండటం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఏబీ చెప్పాడు.
కోహ్లీ కంట్రీ కంటే ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని చాలా మంది భావించవచ్చు. కానీ అది సరైంది కాదు. మీలానే కోహ్లీని మేం కూడా మిస్ అవుతున్నాం. అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడంటూ డివిలియర్స్ తన మిత్రుడు గురించి చెప్పుకొచ్చాడు. 2017లో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. 2021లో వీరికి వామిక అనే కూతురు జన్మించింది.
Also Read: SL vs AFG: క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే క్యాచ్ పట్టిన సమరవిక్రమ, వీడియో వైరల్
కోహ్లీ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారనే కారణంగానే ఇంగ్లండ్ తో సిరీస్ కు దూరమయ్యాడని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీటిని కోహ్లీ సోదరుడు వికాస్ కొట్టిపారేశాడు. తమ తల్లి ఆరోగ్యంగానే ఉందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ నేపథ్యంలో చివరి మూడు టెస్టులకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Also read: Watch: మ్యాచ్ మధ్యలో మైదానంలోకి అనుకోని అతిథి.. దానిని చూసి మ్యాచ్ ను ఆపేసిన అంపైర్లు, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook