IND vs ENG: సెంచరీతో చెలరేగిన రోహిత్.. దాదా రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్..
Rohit Sharma: రాజ్ కోట్ టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను అద్భుతమైన శతకంతో పటిష్ట స్థితిలో నిలిపాడు హిట్ మ్యాన్. ఈ శతకంతో పలు రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
IND vs ENG 3rd Test Live Score: తొలి రెండుటెస్టుల్లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ మూడో టెస్టులో సెంచరీతో మెరిశాడు. ఒత్తిడిని తట్టుకుంటూ హిట్ మ్యాన్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పాలి. రోహిత్ శతకంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ గా ఇది మూడో సెంచరీ కాగా.. ఓవరాల్ గా 11వ టెస్టు సెంచరీ. 131 బంతుల్లో హిట్ మ్యాన్ 14 ఫోర్లు, మూడు సిక్సర్లుతో 131 పరుగులు చేశాడు.
దాదా రికార్డును బ్రేక్ చేసిన రోహిత్
రాజ్‌కోట్ టెస్టులో సెంచరీ చేయడం ద్వారా రోహిత్.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్లలో రోహిత్.. గంగూలీని అధిగమించాడు. దాదా 421 మ్యాచ్‌లలో 18,575 పరుగులు చేయగా.. తాజాగా హిట్‌మ్యాన్ ఆ రికార్డును చెరిపేశాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. రెండు, మూడు స్థానాల్లో విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నారు.
Also Read: IND vs ENG 3rd Test live: నిప్పులు చెరిగిన వుడ్.. మూడు వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన..
సెంచరీ దిశగా జడేజా
రాజ్‌కోట్ టెస్టులో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును రవీంద్ర జడేజాతో కలిసి ఆదుకున్నాడు రోహిత్. లంచ్ తర్వాత బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో ఇద్దరూ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అయితే టీ తర్వాత టీమిండియా రోహిత్ వికెట్ ను కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసిన జడేజా సెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. జడేజా 94 పరుగులతో ఆడుతున్నాడు. మెుదటి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు.
Also Read: Sarfaraz Khan: టెస్టు ఆరంగ్రేటం చేసిన సర్ఫరాజ్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter