Sarfaraz Khan Father gets Emotional: రంజీల్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) ఎట్టకేలకు టెస్టు ఆరంగ్రేటం చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రాజ్‌కోట్ టెస్టు(Rajkot Test)లో సర్ఫరాజ్ కు టీమ్ మేనేజ్‌మెంట్ తుది జట్టులో చోటు కల్పించింది. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్నాడు సర్ఫరాజ్. టీమిండియా తరఫున టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన 311వ ఆటగాడిగా సర్ఫరాజ్ నిలిచాడు.
కొడుకు టెస్టు డెబ్యూ చేయడంతో అతడి తండ్రి నౌషద్ ఖాన్ (Naushad Khan) భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీళ్లతోనే సర్ఫరాజ్‌ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. సర్పరాజ్ భార్య రోమన కూడా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సర్పరాజ్ కల నెరవేరడంతో.. అతడికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అంతేకాకుండా అతడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరమవ్వడం, రాహుల్ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడం, అయ్యర్, భరత్ విఫలమవ్వడంతో సర్ఫరాజ్‌ను జట్టులో చోటు లభించింది. ఇతడికి దేశీవాళీలో అద్భుతమైన రికార్డు ఉంది. 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 65.85 సగటుతో 3912 రన్స్ చేశాడు. ఇందులో 14 సెంచరీలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: IND vs ENG 3rd Test live: నిప్పులు చెరిగిన వుడ్.. మూడు వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన..
Also Read: ICC Rankings 2024: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన టీమిండియా ఆటగాళ్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter