IND vs ENG 3rd Test Live Updates: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతుంటడంతో వికెట్ తీయడానికి ఇంగ్లీష్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓవర్ నైట్ స్కోరు 196/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించింది భారత్. గిల్, కులదీప్ స్టోక్స్ సేనను ఎదుర్కొని పరుగుల రాబట్టారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న గిల్(91) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. మరోవైపు నైట్ వాచ్‌మ‌న్ కుల్దీప్ యాద‌వ్(26) చక్కని సహకారం అందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గిల్ వెనుదిరిగిన కాసేపటికే కులదీప్(27) కూడా ఔటయ్యాడు.  దీంతో భారత్ 78 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ సేన 410 పరుగుల ఆధిక్యంలో ఉంది. రిటైర్డ్ హార్ట్ అయిన జైస్వాల్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం సర్పరాజ్, యశస్వి ఆడుతున్నారు. ఆ జట్టు బౌలర్లలో రూట్, హార్ట్లీ, అహ్మాద్ ఒక్కో వికెట్  తీశారు. 


టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. రోహిత్, జడేజా సెంచరీలతో చెలరేగగా..సర్ఫరాజ్, ధ్రువ్ విలువైన ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు డకెట్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. డకెట్ సెంచరీ చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. దీంతో స్టోక్స్ సేన 319 ప‌రుగుల‌కే కుప్పకూలింది. నిన్న ఆటముగిసే సమయానికి టీమిండియా 322 ప‌రుగుల‌ ఆధిక్యంలో నిలిచింది. 


Also Read: Ravindra Jadeja Rare Feat: రాజ్‌కోట్‌ టెస్టులో చరిత్ర సృష్టించిన జడ్డూ.. దిగ్గజాల సరసన చోటు..


Also read: HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి