IND vs ENG 4th Test Live Updates: రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు ఆరంభమైంది. కీలకమైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో జ‌స్ప్రీత్ బుమ్రా స్థానంలో పేస‌ర్ ఆకాశ్ దీప్(Akash Deep) అరంగేట్రం చేశాడు. టీమిండియా కోచ్ రాహుల్ ద్ర‌విడ్ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా పర్యటనలో వరుసగా రెండు టెస్టులు ఓడిన ఇంగ్లండ్ రాంచీ టెస్టులోనూ తడబడుతోంది. ఆరంగ్రేట పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) నిప్పులు చెరగడంతో లంచ్ కు ముందే ఐదు వికెట్లు కోల్పోయింది స్టోక్స్ సేన. ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్రాలే, డకెట్ తొలుత ఆచితూతి ఆడారు. ముందుగా బెన్ డకెట్(11) ను పెవిలియన్ కు పంపిన ఆకాశ్.. తర్వాత బంతికే ఓలీ పోప్‌(0)ల‌ను వెన‌క్కి పంపాడు. ఆకాశ్ తన తర్వాత ఓవర్ లో అద్భుతమైన డెలివరీతో క్రాలేను బౌల్డ్ చేశాడు. దాంతీ ఇంగ్లండ్ 57 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 


ఆ తర్వాత జో రూట్, బెయిర్ స్టో పరిస్థితిని చక్కదిద్ది స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అశ్విన్ విడదీశాడు. డేంజ‌ర‌స్ బెయిర్‌స్టోను ఎల్బీగా ఔట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. లంచ్‌కు ముందు ఓవ‌ర్లో కెప్టెన్ బెన్ స్టోక్స్(3)ను జ‌డేజా ఔట్ చేసి ఇంగ్లండ్ కు షాకిచ్చాడు. దీంతో ఇంగ్లండ్ 112 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న జో రూట్, బెన్ ఫోక్స్ ఆచితూచి ఆడుతున్నారు. కడపటి వార్తలు అందేసరికి ఇంగ్లండ్ 42 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. 



Also Read: IPL 2024 Updates: గుజరాత్ టైటాన్స్ కు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి షమీ ఔట్..


భార‌త జ‌ట్టు: య‌శ‌స్వీ జైస్వాల్, రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్, ర‌జ‌త్ పాటిదార్, స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ర‌వీంద్ర జ‌డేజా, ధ్రువ్ జురెల్, అశ్విన్, కుల్దీప్ యాద‌వ్, ఆకాశ్ దీప్, సిరాజ్.
ఇంగ్లండ్ టీమ్:  జాక్ క్రాలే, బెన్ డ‌కెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హ‌ర్ట్లే, ఓలీ రాబిన్స‌న్, షోయ‌బ్ బ‌షీర్, జేమ్స్ అండ‌ర్స‌న్.


Also Read: Yuvraj Singh: ఎంపీగా పోటీ చేయ‌నున్న‌ యువరాజ్ సింగ్.. ఏ పార్టీ నుంచంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి