Loksabha Elections 2024: టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. తన అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు యువరాజ్. ఇప్పటి వరకు మైదానంలో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన యూవీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో రాణించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీచేయనున్నాడని సమాచారం.
యువరాజ్ సింగ్ గురుదాస్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సన్నీ డియోల్ గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డియోల్ స్థానంలో యువరాజ్ సింగ్ బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో యువరాజ్ సింగ్ సమావేశమయ్యారు. దాంతో యూవీ రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై యువరాజ్ మాత్రం స్పందించలేదు.
Also Read: Yashasvi Jaiswal: ముంబైలోని బాంద్రా ఏరియాలో ఫ్లాట్ కొన్న యశస్వి.. ధర తెలిస్తే షాక్ అవుతారు..
మనదేశంలో క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్‌లు ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గురుదాస్‌పూర నుంచి ఇప్పటికే బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, వినోద్ ఖన్నాలు ఎంపీగా గెలుపొందారు. కేన్సర్ ను సైతం జయించి.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి సత్తా చాటాడు యువరాజ్. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్స్‌లో ఆడుతున్న యూవీ న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Also Read: HCA BMW Offer: హైదరాబాద్ క్రికెటర్లకు బంపరాఫర్.. రూ.కోటి నగదు, బీఎండబ్ల్యూ కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి