IND vs ENG 5th Test Live updates: ధర్మశాల టెస్టులో టీమిండియా స్పిన్నర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ చేరుతున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ తన మణికట్టు మాయాజలంతో స్టోక్స్ సేన భరతం పడుతున్నాడు. అయితే జోరుమీదున్న టీమిండియా బౌలర్లను ఒకేఒక్క ఆటగాడు అడ్డుకున్నాడు. అతడే క్రాలే. ఈ ఇంగ్లీష్ ఓపెనర్ భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేస్తున్న ఏ మాత్రం తడబడకుండా హాఫ్ సెంచరీ(79) సాధించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఫీట్ నమోదు చేశాడు ఈ ప్లేయర్.  భారత్‌తో స్వదేశంలో ఒక టెస్టు సిరీస్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసి 23 ఏళ్ల రికార్డును సమం చేశాడు. 2001లో హెడెన్ టీమిండియాపై నాలుగు అర్ధ సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాత ఓ ఒక్క ఆటగాడు ఈ ఫీట్ సాధించలేకపోయారు, ఇప్పుడు క్రాలే దానిని చేసి చూపించాడు. 23 ఏళ్ళ తర్వాత టీమిండియాపై నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్‌గా క్రాలీ రికార్డు సృష్టించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐదో టెస్టులో భారత్ బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ముఖ్యంగా కుల్దీప్ స్పిన్ కు ఇంగ్లండ్ ఫ్లేయర్లు దాసోహమన్నారు.  ఓపెనర్లు క్రాలే, డకెట్ మాంచి ఆరంభాన్నే ఇచ్చినా దానిని మిగతా బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. లంచ్ వరకు బాగానే ఆడిన ఇంగ్లీష్ ఆటగాళ్లు.. ఆ తర్వాత పోటీపడి మరి వికెట్లు సమర్పించుకున్నారు. కులదీప్ ఇంగ్లండ్ టాపార్డర్ ను కుప్పకూల్చాడు. ఇతడికి అశ్విన్, జడేజా కూడా తోడవ్వడంతో స్టోక్స్ సేన త్వరగా వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 55 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఫోక్స్, బషీర్ క్రీజులో ఉన్నారు. కుల్దీప్ 5, అశ్విన్ 2 వికెట్లు తీశారు. 



Also Read: IND vs ENG 5th Test Updates: టాస్ గెలిచిన ఇంగ్లండ్‌.. కొత్త ప్లేయర్ జట్టులోకి ఎంట్రీ


Also Read: Ind vs Eng 5th Test: జలపాతంలో జలకాలాడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook