Yashasvi Jaiswal Creats records: టీమిండియా యువ సంచలనం ఇంగ్లండ్ తో సిరీస్ లో దుమ్ములేపుతున్నాడు. వరుసగా నాలుగో టెస్టుల్లో సత్తా చాటిన ఈ యంగ్ ఫ్లేయర్.. చివరిదైనా ఐదో టెస్టులోనూ దంచికొడుతున్నాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో యశస్వి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి ప‌రుగులు..
తాజాగా అర్థ శతకం సాధించడం ద్వారా టెస్టుల్లో 1,000 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో, త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి ప‌రుగులు సాధించిన రెండో టీమిండియా క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. యశస్వి 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించ‌గా.. భారత మాజీ ఆట‌గాడు వినోద్ కాంబ్లీ(Vinod Kambli) కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి ప‌రుగులు చేసిన ఛ‌తేశ్వ‌ర్ పూజారా మూడో స్థానానికి దిగజారాడు. 


కోహ్లీ రికార్డు బ్రేక్..
ధర్మశాల టెస్టులో 57 పరుగులు చేయడం ద్వారా జైస్వాల్ ఈ సిరీస్‌లో 700 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు కోహ్లీని వెనక్కినెట్టి.. ఒక సిరీస్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 2014-15లో ఇదే ఇంగ్లండ్‌పై 692 రన్స్‌ చేయగా.. తాజాగా ఆ రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు.


గవాస్కర్ కు చేరువలో..
అయితే ఒక టెస్టు సిరీస్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో టీమిండియా తరఫున సునీల్‌ గవాస్కర్‌ ఫస్ట్ ఫ్లేస్ లో ఉన్నాడు. గవాస్కర్‌ 1971లో వెస్టిండీస్‌ సిరీస్‌లో 774 పరుగులు చేశాడు. 1978/79లోనూ అదే కరేబియన్ జట్టుపై 732 రన్స్‌ సాధించాడు. ప్రస్తుతం 712 పరుగులతో జైస్వాల్ మూడో స్థానంలో ఉన్నాడు. ధర్మశాల టెస్టు రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్‌ మరో 63 పరుగులు చేస్తే గవాస్కర్ రికార్డు కూడా బద్దలవుతుంది. 


సచిన్‌ రికార్డును తుడిచిపెట్టేసిన జైస్వాల్..
ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌.. బషీర్‌ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ ఇంగ్లీష్ టీమ్ పై 74 ఇన్నింగ్స్‌లలో 25 సిక్సర్లు కొట్టగా. అదే జట్టుపై యశస్వి 26 సిక్సర్లు బాదాడు. 


Also Read: Rohit Sharma: హిట్‌మ్యానా మజాకా... ఒకే రోజు మూడు రికార్డులు కొల్లగొట్టిన రోహిత్..


Also Read: IND vs ENG: ఇంగ్లండ్ ను కుప్పకూల్చిన కుల్దీప్, అశ్విన్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన యశస్వి, రోహిత్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook