RFCL Jobs Recruitment 2024: రామగుండంలో కీలక పోస్టుల భర్తీ, ఎలా అప్లై చేయాలంటే

RFCL Jobs Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ప్రఖ్యాత రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సైతం వెలువడింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటి, ఎలా దరఖాస్తు చేయాలనే వివరాలు పూర్తిగా నోటిఫికేషన్‌లో ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2024, 06:55 AM IST
RFCL Jobs Recruitment 2024: రామగుండంలో కీలక పోస్టుల భర్తీ, ఎలా అప్లై చేయాలంటే

RFCL Jobs Recruitment 2024: తెలంగాణలోని ప్రఖ్యాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఈ సంస్థలో కీలకమైన ఖాళీల్ని భర్తీ చేసేందుకు ఆర్ఎఫ్‌సిఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. వేర్వేరు స్థాయిల్లోని 27 కీలక పోస్టులు భర్తీ చేయనున్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఇంజనీర్, సీనియర్ కెమిస్ట్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల ఖాళీలున్నాయి. 

ఆర్ఎఫ్‌సీఎల్‌లో పోస్టుల భర్తీకు సంబంధించి పూర్తి వివరాలు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్ www.rfcl.co.in.లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 27 ఖాళీలున్నాయి. వీటిలో కెమికల్ ఇంజనీర్ పోస్టులు 11, మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 5, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు 2, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ 1, కెమికల్ ల్యాబ్ సీనియర్ కెమిస్ట్ 2, ఫైనాన్స్ అండ్ ఎక్కౌంట్స్ ఆఫీసర్ 5, మెడికల్ ఆఫీసర్ 1 భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసేందుకు మార్చ్ 31 వరకూ గడువుంది. ఆసక్తి కలిగిన అర్హత ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. 

ఆర్ఎఫ్‌సీఎల్ రిక్రూట్‌మెంట్ 2024లో మెడికల్ ఆఫీసర్ మినహా మిగిలిన పోస్టులకు గరిష్టంగా 30 ఏళ్లుండాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టుకు మాత్రం 35 ఏళ్ల వరకూ ఉండవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు 700 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. 

ఎలా అప్లై చేయాలి

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ప్రక్రియలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా కంపెనీ అధికారిక పోర్టల్ www.rfcl.co.in.ఓపెన్ చేయాలి. హోమ్‌పేజ్‌లో కన్పించే కెరీర్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కన్పిస్తుంది. అందులో Rectt/05/2024 క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ తరువాత అప్లై లింక్ క్లిక్ చేయాలి. అక్కడ స్క్రీన్‌పై కన్పించే అప్లికేషన్ నింపి కావల్సిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరిగా నిర్దేశిత డిపాజిట్ చెల్లించి సబ్మిట్ చేయాలి .

Also read: Parle G: పార్లే జి బిస్కట్ కంపెనీ కధ తెలుసా, ఓ టైలర్ ప్రారంభించిన కంపెనీ అది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News