Dawid Malan doubtful for India vs England semi-final match in T20 World Cup 2022: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022 తుది అంకానికి చేరుకుంది. మెగా టోర్నీ సూపర్ 12 దశ ఆదివారం ముగిసింది. క్వాలిఫైయర్ మ్యాచ్‌ల నుంచే మొదలైన సంచలనాలు.. సూపర్ 12 దశ వరకు కొనసాగాయి. పసికూన జట్లు.. పటిష్ట టీంలను ఓడించడంతో సూపర్ 12 దశ చివరకు వరకు రసవత్తరంగా సాగింది. టైటిల్ హాట్ ఫేవరెట్లల్లో ఒకటైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సూపర్ 12 దశ దాటలేదు. భారత్, న్యూజీలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ సెమీస్ చేరాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం నుంచి టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్స్ మ్యాచులు మొదలు కానున్నాయి. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. సిడ్నీ క్రికెట్ మైదానంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. రెండో సెమీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. గురువారం అడిలైడ్‌ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సెమీస్ మ్యాచుల కోసం ఈ నాలుగు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అస్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 


ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచుకు సిద్దమవుతున్న టీమిండియాకు ఓ శుభవార్త అందింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్ సెమీస్  మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గజ్జల్లో గాయంతో మలన్ బాధపడుతున్నాడు. గాయం కారణంగా అతడు నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈసీబీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో మలన్ ఉన్నాడు. అతడికి మెరుగైన వైద్యం అందిస్తోంది. సెమీస్ మ్యాచుకు ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో అతడు కోలుకుంటాడని ఈసీబీ ఆశిస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా వుంటే మాత్రం మలన్ మ్యాచ్ ఆడలేడు. ఆడే నిజమైతే భారత్ సగం మ్యాచ్ గెలిచినట్టే. 


ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో డేవిడ్ మలన్ అర్ధాంతరంగా మైదానం నుంచి వెళ్లిపోయాడు. 15వ ఓవర్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో గజ్జల్లో నొప్పితో మైదానం వీడాడు. మలన్ అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా రిజర్వ్ ప్లేయర్‌ను తుది జట్టులోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. రిజర్వ్ ప్లేయర్లుగా ల్యూక్ వుడ్, రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్ ఇంగ్లండ్ జట్టుకు అందుబాటులో ఉన్నారు.


Also Read: రోహిత్ భాయ్.. ఒకే ఒక్క హగ్‌ అంటూ ఫ్యాన్ కన్నీటిపర్యంతం! గుండెలు పిండేసే వీడియో


Also Read: Hardik Pandya: హర్ధిక్ పాండ్యా హిట్ వికెట్.. సైలెంట్‌గా బెయిల్స్ వికెట్లపై పెట్టేశాడు.. వీడియో వైరల్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook