IND vs ENG: `విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేనప్పుడు రన్స్ చేయాలని కోరుకున్నా.. కానీ గురువారం మాత్రం డకౌట్ కావాలి`
Kevin Pietersen wants Please have a day off Thursday for Virat Kohli. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ రన్స్ చేయకూడని కెవిన్ పీటర్సన్ కోరుకుంటున్నాడు.
Kevin Pietersen wants Virat Kohli not to score runs in T20 World Cup 2022 Semi Final against England: ఆసియాకప్ 2022 ముందువరకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులు చేయలేక సతమతమయిన విషయం తెలిసిందే. దాదాపుగా మూడేళ్లు సెంచరీ చేయక కోహ్లీ బ్యాట్ మూగబోయింది. అరకొర హాఫ్ సెంచరీలు బాదినా కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. భారత మాజీలు కూడా విమర్శించారు. జట్టు నుంచి ఉద్వాసన తప్పదు అంటూ హెచ్చరించారు కూడా. ఈ సమయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మద్దతుగా నిలిచాడు. విరాట్ ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కేపీ కోరుకున్నట్టే కోహ్లీ ఫామ్ అందుకున్నా.. ఇప్పుడు డకౌట్ కావాలని కోరుకుంటున్నాడు.
ఆసియాకప్ 2022లో ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ 2022లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రపంచకప్ 2022లో కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లపై హాఫ్ సెంచరీలు బాది టీమిండియాకు అద్భుత విజయాలు అందించాడు. సూపర్ 12 దశలో ఆడిన ఐదు మ్యాచులలో 246 రన్స్ చేసి.. ప్రస్తుతం ప్రపంచకప్ 2022లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. ఇక గురువారం జరిగే సెమీస్ మ్యాచులో (నవంబర్ 10) ఇంగ్లండ్ జట్టుపై కూడా విరాట్ చెలరేగాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే కెవిన్ పీటర్సన్ మాత్రం తన జట్టుపై కోహ్లీ రన్స్ చేయొద్దని కోరుకుంటున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2022ను బాగా ఎంజాయ్ చేస్తున్నా అని విరాట్ కోహ్లీ ఓ పోస్ట్ చేశాడు. దానికి కెవిన్ పీటర్సన్ స్పందిస్తూ... 'విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు నేను చాలా మద్దతు ఇచ్చా. గురువారం నాటి సెమీ ఫైనల్‌లో మాత్రం కోహ్లీ రన్స్ చేయకూడని కోరుకుంటున్నా. కోహ్లీకి ప్రేక్షకులు, పెద్ద వేదిక కావాలి. టీ20 ప్రపంచకప్ కన్నా పెద్ద వేదిక ఏముంటుంది. అందుకే కోహ్లీ చెలరేగుతున్నాడు. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కోహ్లీ ఆడకూడదు. గురువారం రోజు అతని బ్యాటుకు ఆఫ్-డే అయితే చాలు' అని పేర్కొన్నాడు.
'విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు ఫామ్ అందుకోవడం కేవలం భారత జట్టుకే కాదు.. ప్రపంచ క్రికెట్‌కు శుభపరిణామం. విరాట్ లాంటి ప్లేయర్ ఆడుతుంటే.. మిగతా వాళ్లకు ఆ ఫామ్ సోకుతుంది. ఓ ప్లేయర్స్ ఆడుతుంటే.. మిగతా ఆటగాడికి ఊపొస్తుంటుంది. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం స్వేచ్ఛగా ఆడటానికి కారణం కోహ్లీ ఫామ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు' అని కెవిన్ పీటర్సన్ అన్నాడు.
Also Read: Sania-Shoaib Divorce: సానియా, షోయబ్‌ల విడాకులు.. వెలుగులోకి అసలు కారణం! వివాహేతర సంబంధమే
Also Read: IPL 2023: భారత ఆటగాళ్లను ఇతర లీగ్‌లలో ఆడనివ్వం.. కారణం చెప్పిన ఐపీఎల్ ఛైర్మన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి