Sania Mirza-Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌‌ల విడాకులు.. వెలుగులోకి అసలు కారణం! వివాహేతర సంబంధమే

Is Shoaib Malik cheated wife Sania Mirza. వివాహేతర సంబంధమే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌ల విడాకులకు కారణమా?.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 9, 2022, 08:42 AM IST
  • సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌‌ల విడాకులు
  • వెలుగులోకి అసలు కారణం
  • వివాహేతర సంబంధమే
Sania Mirza-Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌‌ల విడాకులు.. వెలుగులోకి అసలు కారణం! వివాహేతర సంబంధమే

Is Shoaib Malik cheated wife Sania Mirza: ప్రస్తుతం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌ల పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ కపుల్స్ విడాకులు (Sania-Shoaib Divorce) తీసుకుంటున్నట్లు రెండు రోజలుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడమే అందుకు కారణం. ఇటీవలి రోజుల్లో సానియా-మాలిక్‌‌ సంసార జీవితం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. విడాకుల గురించి పలు రూమర్లు వస్తున్నా ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో సానియా చేసిన పోస్ట్‌లు కూడా ఈ ప్రచారానికి ఆజ్యం పోస్తున్నాయి.

భర్త షోయబ్ మాలిక్ మోసం చేయడంతోనే.. సానియా మీర్జా విడాకుల వరకు వెళ్లిందనే ఓ వార్త నెట్టింట వెలుగులోకి వచ్చింది. ఓ మోడల్‌తో మాలిక్ పెట్టుకున్న వివాహేతర సంబంధమే సానియా కాపురంలో నిప్పులు పోసాయని ఆ వార్తల సారాంశం. కొన్నాళ్ల క్రితం  మాలిక్‌కు మోడల్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందట. అది కాస్త చనువుగా ఉండే వరకు వెళ్లిందట. సదరు మోడల్ మోజులో పడిన మాలిక్.. సానియాను అస్సలు పట్టించుకోవడం లేదట. 

షోయబ్ మాలిక్‌‌లో వచ్చిన తేడాను గమనించిన సానియా మీర్జా.. అసలు విషయం ఏంటో తెలుకున్నారట. విషయం తెలియగానే సానియా హృదయం బద్దలై.. భర్త నుంచి దూరంగా వచ్చేశారట. దూరంగా ఉంటున్నా భార్యను కన్విన్స్ చేసే ప్రయత్నం మాలిక్ చేయలేదట. దాంతో ఆగ్రహానికి గురైన సానియా.. తమ బంధాన్ని ముగించుకోవడానికి సిద్ధపడ్డారట. మాలిక్ మోసాన్ని తట్టుకోలేకనే సానియా తన కొడుకు ఫొటోను షేర్ చేసి.. 'కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే క్షణాలు' అంటూ పేర్కొన్నారట. ఆపై 'ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది' అని మరో పోస్ట్ చేశారు. 

సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ల వివాహ బంధంపై సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరుగుతున్నా.. ఈ స్పోర్ట్స్ కపుల్స్ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. కనీసం ట్వీట్ చేసి అయినా రూమర్లకు చెక్ పెట్టలేదు. అయితే నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఈ ప్రచారంలో ఎంతనిజముందో కూడా తెలియదు. సానియా మీర్జా లేదా షోయబ్ మాలిక్ స్పందిస్తే గాని అసలు విషయం బయటపడేలా లేదు. సానియా, మాలిక్‌ల వివాహం 2010లో జరగ్గా.. నాలుగేళ్ల క్రితం వీరికి ఓ కుమారుడు జన్మించాడు.

Also Read: Gold Price Today 9 November: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర! వరుసగా మూడోరోజు

Also Read: Delhi Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. ముగ్గురు మృతి! ఢిల్లీలో భారీ ప్రకంపనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News