Phil Salt likely to play India vs England T20 World Cup 2022 Semi Final: టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమవుతోంది. బుధవారం (సెప్టెంబర్ 9) న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సిడ్నీ క్రికెట్ మైదానంలో మధ్యాహ్నం 1.30 ఈ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఇక అడిలైడ్‌ వేదికగా గురువారం (నవంబరు 10) మధ్యాహ్నం భారత్, ఇంగ్లండ్‌ జట్లు రెండో సెమీ ఫైనల్లో తలపడనున్నాయి. సెమీ ఫైనల్లో గెలిచిన జట్లు  ఫైనల్ ఆడుతాయి. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా నాలుగు టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్  కోసం సిద్దమవుతున్న ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్ సెమీస్ మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గజ్జల్లో గాయం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో  మలన్ అర్ధాంతరంగా మైదానం నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం గాయంతో మలన్ ఇబ్బందిపడుతున్నాడు. దాంతో నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఈసీబీ వైద్యుల పర్యవేక్షణలో మలన్ చికిత్స పొందుతున్నాడు. గాయం తీవ్రత దృష్టా సెమీస్ మ్యాచులో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తోంది. 


డేవిడ్ మలన్ స్థానంలో ఇంగ్లండ్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసిందట. టీ20 ప్రపంచకప్‌ 2022లో ఇంకా ఆడని ఫిల్ సాల్ట్‌ను తుది జట్టులో ఆడించాలని ఈసీబీ చూస్తోంది. సాల్ట్‌ మూడో స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి. మెగా టోర్నీలో ఇప్పటివరకు జోస్ బట్లర్‌తో కలిసి అలెక్స్ హెల్స్ ఇన్నింగ్‌ను ఆరంబించాడు. హెల్స్ బదులుగా సాల్ట్‌ బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. టీ20ల్లో సాల్ట్‌ స్ట్రైక్ రేట్‌ 164.33గా ఉంది. స్ట్రైక్ రేట్‌ దృష్టిలో ఉంచుకునే.. జేమ్స్ విన్స్, సామ్ బిల్లింగ్స్‌, జేసన్ రాయ్ లాంటి హిట్టర్లను కూడా ఈసీబీ పక్కన పెడుతోందట. సాల్ట్‌ స్ట్రైక్ రేట్‌ టీమిండియా బౌలర్లలో గుబులురేపుతోంది. 


ఫిల్ సాల్ట్ వయసు 26 సంవత్సరాలు. ఇప్పటివరకు 11 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచులు ఆడి 164.33 స్ట్రైక్ రేట్‌తో 235 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో సాల్ట్ రాణించాడు. లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో అతడు 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక 8 వన్డేల్లో 369 రన్స్ బాదాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 


Also Read: IND vs ENG: దినేష్ కార్తీక్ or రిషబ్ పంత్.. సెమీస్‌లో ఎవరు ఆడుతారు! రవిశాస్త్రి ఓటు ఎవరికో తెలుసా  


Also Read: Samantha Yashoda movie : నా మొహం మీద కొట్టారు.. అర్థగంట అదే షాక్‌లో ఉన్నా.. సమంత కామెంట్స్ వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి