Samantha Action Sequence : సమంత ప్రస్తుతం తనకు బాగా లేకపోయినా కూడా యశోద సినిమా కోసం బయటకు వచ్చింది. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. యాంకర్‌గా సుమ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు చెప్పింది. కొన్ని సమాధానాలు సమంత చెబుతూ ఉంటే.. అందరి కంట్లో నీళ్లు తిరగాల్సిందే. తాను ఎదుర్కొన్న పరిస్థితులు, అనారోగ్యానికి గురవ్వడం, ఒక్కోసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితి అంటూ ఏడుస్తూ సమంత చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి.
సమంత ఈ యశోద సినిమా కోసం ఎంతలా కష్టపడిందో ఇది వరకు చెప్పేశారు హీరో, నిర్మాత. సమంత బెడ్డు మీద సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పిందట. ఈ విషయాన్ని నిర్మాత బయటకు చెప్పేశాడు. ఇక ఇప్పుడు సమంత ఈ సినిమా సమయంలో జరిగిన ఘటనల గురించి చెప్పింది. సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాను కాబట్టే ఇలా టెన్షన్ పడుతున్నాను.. కానీ ఎక్కువ టెన్షన్ పడకూడదని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అని సమంత చెప్పుకొచ్చింది.
చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేయడం నాకు అంతగా నచ్చదు.. అయితే ఈ కథను విన్న వెంటనే ఓకే చెప్పాను.. మామూలుగా అయితే ఏ కథ విన్నా కూడా కొంత టైం తీసుకుంటాను.. కానీ దీనికి మాత్రం వెంటనే ఓకే చెప్పాను.. యథార్థ సంఘటనల ఆధారంగా కథను రాశాను అని చెప్పడంతో వెంటనే సరేనని చెప్పాను అంటూ సమంత తెలిపింది.
ఇక ఇప్పుడు తనకు డ్యాన్సుల కంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్‌లే చేయాలని ఉందనే కోరికను బయటపెట్టేసింది. తాను ఇందులో రియలిస్టిక్‌గా స్టంట్లు చేశానని, ఓ సమయంలో తనకు మొహం మీద దెబ్బ తగిలిందని, పంచ్ పడిందంటూ చెప్పుకొచ్చింది. ఓ అర్దగంట అదే షాక్‌లో ఉండిపోయాను అని సమంత చెబితే.. ఆ తరువాత పళ్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూపించుకున్నారా? అంటూ సుమ కౌంటర్ వేసింది. సమంతకు యశోద సినిమా ఎలాంటి ఇమేజ్‌ను తీసుకొస్తుందో చూడాలి.
Also Read : Jabardasth Varsha : జనాలను పిచ్చోళ్లను చేయడమే పనా?.. వర్ష ఇమాన్యుయేల్ అతికి నిదర్శనమిదే
Also Read : Samantha quotes : దేవుడు చేసే ప్రతీ దానికి ఓ కారణం ఉంటుందట.. సమంతకు ఏమైంది? ఇలా ఎందుకు అంటోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook