Ravi Shastri Picks Rishabh Pant insted of Dinesh Karthik For India vs England T20 World Cup 2022 Semi Final: టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌ 12లో ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో గ్రూప్‌ 2 టాపర్‌ హోదాలో భారత్ సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే. అడిలైడ్‌ వేదికగా గురువారం (నవంబరు 10) మధ్యాహ్నం జరుగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ కీలక మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌ సెషన్‌లో స్వల్పంగా గాయపడ్డా.. మళ్లీ బ్యాటింగ్ మొదలెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్‌ 12లో ఆడిన భారత జట్టే దాదాపుగా సెమీస్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే విషయంలో సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. స్పెషలిస్టు ఫినిషర్‌గా జట్టులోకి వచ్చిన కార్తీక్.. రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా రాణించలేదు. పైగా వికెట్ కీపింగ్‌లో కూడా కొన్నిసార్లు విఫలమయ్యాడు. దీంతో డీకే స్థానంలో పంత్‌ను తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. పంత్ కూడా జింబాబ్వే మ్యాచ్‌లో 5 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.


దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే ప్రశ్నపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. 'దినేష్ కార్తీక్ మంచి ప్లేయర్. అయితే ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ బౌలింగ్ ఎటాక్‌ను పరిగణలోకి తీసుకుంటే.. ఎడం చేతి వాటం బ్యాటింగ్ చేసే ప్లేయర్ జట్టుకు చాలా అవసరం. గతంలో కూడా ఇంగ్లండ్‌పై పంత్ బాగా రాణించాడు. చివరగా ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన వన్డే మ్యాచ్‌లో  పంత్ చెలరేగాడు. ఈ నేపథ్యంలో నేనైతే సెమీస్‌లో పంత్‌ను ఆడిస్తా. పంత్ జట్టులో ఎక్స్ ఫ్యాక్టర్ కూడా' అని రవిశాస్త్రి అన్నారు.


Also Read: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!


Also Read: Chandra Grahan 2022: చంద్రగ్రహణం నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి