Chandra Grahan 2022 Time: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, భారతదేశంలో సాయంత్రం 5.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సాయంత్రం 6.20 గంటలకు ముగుస్తుంది. గ్రహణానికి 9 గంటల ముందు అంటే ఉదయం 8.20కు సూతక్ కాలం ఏర్పడుతుంది. గ్రహణంలో సూతకాలాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత ప్రజలు గంగానదిలో స్నానం చేస్తారు. అనంతరం మీరు ఇష్ట దైవాన్ని పూజించి.. ఆహారం తీసుకోండి.
చంద్రగ్రహణం ఏయే దేశాల్లో కనిపిస్తుంది..
భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఈశాన్య యూరప్, ఉత్తర అమెరికా, నైరుతి యూరప్‌తో సహా పలు దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది.
చంద్రగ్రహణం సమయంలో ఈ పని చేయకండి..
చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో స్త్రీలు ఇంటి నుండి బయటకు రాకూడదు మరియు నిద్రకు దూరంగా ఉండాలి. గ్రహణం సమయంలో మతపరమైన పనులు చేయవద్దు. గ్రహణం సమయంలో చంద్రుడిని లేదా మీ ఇష్ట దైవాన్ని జపించండి. గ్రహణం సమయంలో పిల్లలను బయటకు వెళ్లనివ్వకండి. చంద్రగ్రహణం సమయంలో ఆలయ తలుపులు మూసి ఉంచండి. గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.
సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల వ్యవధిలో చంద్రగ్రహణం ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఏర్పడిన మొత్తం నాలుగు గ్రహణాలు.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే చోటుచేసుకోవడం విశేషం. ఈ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనుందని ఖగోళ పరిశోధకులు వెల్లడించారు. హైదరాబాద్ లో సాయంత్రం 5:44 నుంచి 6:18 వరకు గ్రహణం కనిపించనుంది.
Also Read: Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఈ రోజు ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి