Ind Vs Eng World Cup 2023 Updates: వరల్డ్ కప్‌లో టీమిండియా బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీ తొలిసారి డకౌట్ అయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. అనూహ్యంగా డకౌట్ కావడంతో టీమిండియా ఫాన్స్ షాక్‌ అయ్యారు. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్ (9) ఔట్ అవ్వగానే కోహ్లీ క్రీజ్‌లోకి రాగా.. ఖాతా తెరించేందుకు ఇబ్బందిపడ్డాడు. 8 బంతులను డాట్ ఆడాడు. దీంతో విసుగు చెందిన కోహ్లీ.. భారీ షాట్‌కు ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్‌ ఇచ్చాడు. అయితే విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఇంగ్లాండ్ డేవిడ్ విల్లీ పెద్ద ప్లాన్ వేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోహ్లీని ఒక్క పరుగు కూడా చేయకుండా ఔట్ చేయాలనే ఉద్దేశంతో వరుసగా ఒకే తరహా బంతులను వేశాడు. లైన్ అండ్ లెంగ్త్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా.. కచ్చితత్వంతో కోహ్లీకి బౌలింగ్ చేశాడు. ఈ టైట్ బాల్స్‌ కోహ్లీని ఇబ్బందిపెట్టాయి. దీంతో భారీ షాట్‌తో విల్లీకి బుద్ధి చెబుదామని భారీ షాట్‌కు ప్రయత్నించాడు. మిడాఫ్‌లో బెన్‌స్టోక్స్ సులభంగా క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. కోహ్లీ వికెట్ తీసిన విల్లీ.. హద్దులు లేని ఉత్సాహంతో వేడుకలు జరుపుకున్నాడు. విరాట్ కోహ్లీ వికెట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


 



ఈ ప్రపంచకప్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. గిల్ (9), విరాట్ కోహ్లీ (0), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నారు. 39 పరుగులు చేసి రాహుల్ ఔట్ అయినా.. హిట్‌మ్యాన్‌ ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (87)కు తోడు సూర్యకుమార్ యాదవ్ (24) క్రీజ్‌లో ఉన్నాడు. 


Also Read: Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. నాగం జనార్థన్‌ రెడ్డి రాజీనామా  


 Also Read: Onion Politics: అప్పట్లో ఉల్లి దండ మెడలో వేసుకున్న ఇందిరా గాంధీ.. ఎందుకంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook