Rohit-Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. టాప్‌లో ఎంఎస్ ధోనీ!
IND vs HK, Rohit Sharma surpasses Virat Kohli as India T20I Captain. టీ20ల్లో భారత్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన రెండో సారథిగా రోహిత్ శర్మ నిలిచాడు.
Rohit Sharma becomes Team India second most successful T20 Captain: ఆసియా కప్ 2022లో భాగంగా బుధవారం (ఆగస్ట్ 31) హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (59 నాటౌట్; 44 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) రాణించారు. లక్ష్య ఛేదనలో హాంగ్ కాంగ్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది.
ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. టీ20ల్లో భారత్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన రెండో సారథిగా రోహిత్ నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. రోహిత్ కెప్టెన్‌గా 31 టీ20ల్లో టీమిండియాకు విజయాలు అందించాడు. 37 టీ20ల్లో 31 విజయాలు అందించడం విశేషం. కోహ్లీ సారథిగా భారత జట్టుకు 50 మ్యాచ్‌ల్లో 30 విజయాలు అందించాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ టాప్‌లో ఉన్నాడు. ధోనీ 72 మ్యాచ్‌లలో 41 విజయాలు అందించాడు.
టీ20ల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్న విషయం తెలిసిందే. 134 మ్యాచుల్లో 3,520 పరుగులు చేశాడు. పాక్‌పై 12 పరుగులు చేసిన రోహిత్.. అప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కివీస్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ (121 మ్యాచుల్లో 3,497)ను అధిగమించాడు. హాంకాంగ్‌పై 21 పరుగులు చేసిన భారత కెప్టెన్ టీ20ల్లో 3500 పరుగుల మార్క్‌ను దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది టీ20లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హిట్‌మ్యాన్ సునాయాసంగా 4000 రన్స్ చేసే అవకాశం ఉంది.
Also Read: చివరి ఓవర్‌లో సూర్యకుమార్ వీరవిహారం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ రియాక్షన్!
Also Read: చిటికెలు వేస్తే ఫలితం ఇలానే ఉంటుంది.. లైగర్‌పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook