Kohli-Suryakumar: చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ వీరవిహారం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ రియాక్షన్!

IND vs HK, Virat Kohli's heartwarming gesture to Suryakumar Yadav. భారత్ ఇన్నింగ్స్‌ ముగిశాక సూర్యకుమార్ యాదవ్‌ను అభినందిస్తూ విరాట్ కోహ్లీ ‘టేక్‌ ఏ బౌ’ చెప్పాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 1, 2022, 12:27 PM IST
  • హాంకాంగ్‌ vs భారత్ మ్యాచ్‌
  • చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ వీరవిహారం
  • వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ రియాక్షన్
Kohli-Suryakumar: చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ వీరవిహారం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ రియాక్షన్!

Virat Kohli's heartwarming gesture to Suryakumar Yadav: ఆసియా కప్ 2022లో భాగంగా బుధవారం పసికూన హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచులో భారత్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (59 నాటౌట్; 44 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో హాంగ్ కాంగ్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది. దీంతో 40 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 

ఈ మ్యాచులో కెప్టెన్‌ రోహిత్ శర్మ (21) దూకుడుగా ఆడి పెవిలియన్ చేరాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (36) మాత్రం ఆచితూచి ఆడాడు. రాహుల్ మరీ నెమ్మదిగా ఆడాడు. రాహుల్ పెవిలియన్‌కు చేరే సమయానికి భారత్ స్కోరు 13 ఓవర్లకు 94/2. మరోవైపు రోహిత్ అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా నెమ్మదిగానే తన ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. అయితే సూర్యకుమార్‌ యాదవ్ మాత్రం మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడాడు. కోహ్లీ, సూర్య కలిసి ఏడు ఓవర్లలోనే 98 పరుగులు చేశారు. 

చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్ వీరవిహారం చేశాడు. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. నాలుగో బంతిని హాంకాంగ్‌ బౌలర్‌ హరూర్‌ అర్షద్‌ స్లో బౌన్సర్‌గా విసరగా.. సూర్య షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. ఇదో బంతిని కూడా స్లో బౌన్సర్‌గా సంధించగా..  ఈ సారి సూర్య సిక్సర్‌ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు తీశాడు. దాంతో ఈ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. సూర్య కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొన్నాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Star Sports India (@starsportsindia)

భారత్ ఇన్నింగ్స్‌ ముగిశాక సూర్యకుమార్ యాదవ్‌ను అభినందిస్తూ విరాట్ కోహ్లీ ‘టేక్‌ ఏ బౌ’ చెప్పాడు. టేక్‌ ఏ బో అన్నట్లుగా తలవంచి సూర్యకు అభినందనలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. కోహ్లీ నుంచి ఇలాంటి అభినందన వస్తుందని తాను అస్సలు ఊహించలేదని తెలిపాడు. చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. 

Also Read: చిటికెలు వేస్తే ఫలితం ఇలానే ఉంటుంది.. లైగర్‌పై తమ్మారెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌!

Also Read: King Cobra Video: ఆ కారు యజమానికి దడ పుట్టించిన కింగ్ కోబ్రా.. వారం రోజులకు పైగా వాహనంలోనే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News