Asia Cup 2022: Suryakumar Yadav shared his batting Secret after his amazing performance against Hong Kong match: ఆసియా కప్‌ 2022లో భాగంగా హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. కేఎల్‌ రాహుల్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. హాంగ్‌కాంగ్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 98 పరుగులను జోడించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పెను విధ్వంసం సృష్టించాడు. హాంకాంగ్‌ బౌలర్‌ హరూర్‌ అర్షద్‌ వేసిన తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. నాలుగో బంతిని అర్షద్‌ స్లో బౌన్సర్‌గా విసరగా.. సూర్య షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. ఐదవ బంతిని కూడా అర్షద్‌ స్లో బౌన్సర్‌ వేయగా.. లెగ్ సైడ్ వైపు సూర్య సిక్సర్‌ బాదాడు. చివరి బంతికి షాట్ ఆడినా రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. సూర్య వీరవిహారంతో అర్షద్‌ వేసిన 20వ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 


హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా ఎంపికయిన సూర్యకుమార్‌ యాదవ్‌ తన బ్యాటింగ్ సీక్రెట్‌ వెల్లడించాడు. మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌ మాట్లాడుతూ... 'నా ఇన్నింగ్స్ పట్ల సంతోషంగా ఉన్నా. ఇలాంటి షాట్లను ఇంతకుముందు ప్రాక్టీస్‌ చేయలేదు. అయితే చిన్నప్పుడు స్నేహితులతో కలిసి సిమెంట్ రోడ్‌ మీద రబ్బర్‌ బంతులతో క్రికెట్‌ ఆడాను. బహుశా దానివల్లే ఇలాంటి షాట్లు సాధ్యమయ్యాయని నా అభిప్రాయం. ఎక్కువగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తా.. నా బ్యాటింగ్ సీక్రెట్‌ అదే' అని తెలిపాడు. 


'హాంకాంగ్‌తో జరిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్‌ గురించి రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌తో మాట్లాడా. నేను బ్యాటింగ్‌కు దిగేటప్పుడే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నా. జట్టు స్కోర్ కనీసం 170 నుంచి 175 పరుగులు చేయాలనేదే మా లక్ష్యం. ఈ వికెట్‌పై అది చాలా మంచి స్కోరు. చివరికి 192 పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉంది' అని సూర్యకుమార్‌ యాదవ్ చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి అభినందన వస్తుందని అస్సలు ఊహించలేదని సూర్య చెప్పాడు. 


Also Read: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ‌.. టాప్‌లో ఎంఎస్ ధోనీ!


Also Read: చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ వీరవిహారం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ రియాక్షన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook