Hardik Pandya Controversial Out: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై వివాదం చెలరేగుతోంది. ఈ మ్యాచ్‌లో పాండ్యా ఔట్ కాకపోయినా.. థర్డ్ అంపైర్ తప్పిదంతో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. థర్డ్ అంపైర్ కళ్లు మూసుకుని పాండ్యాను ఔటిచ్చారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా ఇన్నింగ్స్‌లో 40వ ఓవర్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారెల్ మిచెల్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ ఓవర్‌లో నాల్గో బంతిని స్ట్రైక్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా మిస్ చేశాడు. బంతి నేరుగా వికెట్ కీపర్ టామ్ లాథమ్ చేతుల్లోకి వెళ్లింది. అయితే కీపర్ గ్లౌవ్స్‌ తగిలి బెయిల్స్ కిందపడిపోయాయి. వెంటనే న్యూజిలాండ్ ఆటగాళ్లు ఔట్ కోసం అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించారు.


థర్డ్ అంపైర్ పద్మనాభన్ పదేపదే రిప్లైలు పరిశీలించారు. బంతికి బ్యాట్‌కు తాకిందేమోనని అల్ట్రా ఎడ్జ్‌ను కూడా చెక్ చేశాడు. బంతి బెయిల్స్‌ను తాకలేదని రిప్లైలో క్లియర్‌గా కనిపించింది. కీపర్ గ్లౌవ్స్‌ తాకి బెయిల్స్ పడిపోవడంతో పాండ్యా నాటౌట్ అని అందరూ అనుకున్నారు. కానీ అనూహంగా థర్డ్ అంపైర్ నిర్ణయం ఔట్‌గా వచ్చింది.


దీంతో హార్దిక్ పాండ్యాతోపాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియో పాండ్యా నాటౌట్ అని తెలుస్తున్నా.. ఎలా ఔటిచ్చాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. అంపైర్ తప్పు నిర్ణయంతో 38 బంతుల్లో 28 పరుగులు చేసిన పాండ్యా.. నిరాశగా పెవిలియన్‌ చేరుకున్నాడు. పాండ్యా క్రీజ్‌లో ఉంటే.. భారత్ మరింత భారీ స్కోరు చేసేదని క్రికెట్ అభిమానులు అంటున్నారు. 


 




న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. వికెట్ కీపర్ టామ్ లాథమ్ క్రీజ్‌లోకి రాగానే.. ఇషాన్ కిషన్ తన గ్లౌవ్స్‌తో బెయిట్స్ పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని లాథమ్ డిఫెన్స్ ఆడగా.. బంతి మిస్సై కీపర్ ఇషాన్ కిషన్ చేతుల్లో పడింది. వెంటనే బెయిల్స్ కిందపడేసిన ఇషాన్ ఔట్‌కు అప్పీల్ చేశాడు.


మిగతా ఆటగాళ్లు కూడా గట్టిగా ఔట్ అని అరవడంతో.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రిప్లైలు పరిశీలంచిన థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ చేసిన కొంటె పని వీడియోలో బయటపడింది. దీంతో సరదాగా నవ్వుకున్నాడు. పాండ్యాను ఔట్ చేయించిన లాథమ్‌పై ఇషాన్ రివేంజ్ తీర్చుకున్నాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 



 



Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  


Also Read: Airtel Plans: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరగనున్న ప్లాన్‌ల ధరలు..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి