Team India Playing 11 Vs New Zealand: టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు రాంచీ చేరుకున్నాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా రంగంలోకి దిగనుంది.  రేపు రాత్రి 7:00 గంటల మ్యాచ్‌ ఆరంభంకానుంది. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్‌లోనూ అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. యువ ఆటగాడు పృథ్వీ షా చాలా కాలం తరువాత మళ్లీ జట్టులోకి రాగా.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం నుంచి ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే రేపటి మ్యాచ్‌కు తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవాళీ మ్యాచ్‌ల్లో నిలకడగా రాణిస్తున్నా పృథ్వీ షాకు ఎట్టకేలకు సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింద. అయితే ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌కు తోడు ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. శ్రీలంక సిరీస్‌లో అరంగేట్రం చేసిన రాహుల్ త్రిపాఠి మరిన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అతను వన్‌డౌన్‌లో రానుండగా.. స్టార్ బ్యాట్స్‌మెన్ యథావిధిగా నాలుగోస్థానంలో ఆడనున్నాడు. వికెట్ కీపర్‌గా జితేష్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. 


వన్డేల్లో మిడిల్ ఆర్డర్‌లో ఆడిన ఇషాన్‌ను అదేస్థానంలో కొనసాగించి.. పృథ్వీ షాను ఓపెనర్‌గా పంపస్తే జితేష్ శర్మ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఫినిషర్స్‌గా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా చెలరేగితే.. కివీస్‌కు కష్టాలే. వన్డేల్లో సూపర్‌గా బౌలింగ్‌ చేసిన కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. పేస్ బాధ్యతలను శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ మోయనున్నారు.


భారత్ తుది జట్టు (అంచనా): ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్)/పృథ్వీ షా, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.


Also Read: Nasal Vaccine: సూపర్ గుడ్‌న్యూస్.. ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..?  


Also Read: PPF Calculator: పీపీఎఫ్‌లో భారీ ఆదాయం పొందాలనుకుంటున్నారా..? ఈ ట్రిక్‌ పాటిస్తే మీరు కోటీశ్వరులే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి