Nasal Vaccine: సూపర్ గుడ్‌న్యూస్.. ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..?

Bharat Biotech Nasal Covid Vaccine: దేశ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్ ఇది. ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ వచ్చేసింది. గురువారం కేంద్రమంత్రులు చేతులుగా ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ ఎంత ధర ఎంత..? ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఏం చేయాలి..? ఎన్ని డోసులు తీసుకోవాలి..? వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 06:38 PM IST
Nasal Vaccine: సూపర్ గుడ్‌న్యూస్.. ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..?

Bharat Biotech Nasal Covid Vaccine: భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ iNCOVACCను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం  ప్రారంభించారు. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ప్రభుత్వానికి రూ.325కి అందజేస్తుండగా.. ప్రైవేట్ ఆసుపత్రులకు 800 రూపాయలకు లభిస్తోంది. భిన్నమైన బూస్టర్‌ల కోసం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కావడం విశేషం.

భారత్ బయోటెక్ డిసెంబర్ 2022లో ప్రాథమిక 2-డోస్, హెటెరోలాగస్ బూస్టర్‌గా ఆమోదించింది. అంతకుముందు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) 18 ఏళ్లపైబడిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను వేయడానికి అనుమతి ఇచ్చింది. ఇది తక్కువ ఖర్చుతో కూడిన కోవిడ్ వ్యాక్సిన్. అందులోనూ ఈ వ్యాక్సిన్‌కు సిరంజిలు, సూదులు, ఆల్కహాల్ వైప్స్, బ్యాండేజీలు మొదలైనవి ఏమి అవసరం లేదు.

ఇంట్రానాసల్‌ను 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయాలి. ఈ వ్యాక్సిన్ కోసం కోవిన్ వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. iNCOVACC వాషింగ్టన్ యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇంట్రానాసల్ హెటెరోలాగస్ బూస్టర్ డోస్ ఫిబ్రవరి మొదటి వారంలో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌ల వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి అనుమతి పొందిన విషయం తెలిసిందే.

"ఆత్మనిర్భర్ భారత్ ప్రయత్నాల కింద ఈరోజు ఇంట్రానాసల్‌ను ప్రారంభించడం ఓ మైలురాయి. నేడు ప్రపంచానికి 65 శాతం వ్యాక్సిన్ మన దేశం నుంచే అందుతోంది. భారత్ తయారీ రంగం, పరిశోధన, ఆవిష్కరణ సామర్థ్యాలను ప్రపంచ దేశాలు మెచ్చుకున్నాయి. కేవలం ఫార్మసీకి మన దేశం ప్రసిద్ధి చెందిందని కాకుండా.. ప్రస్తుతం పరిశోధన, ఆవిష్కరణలలో కూడా దూసుకుపోతుంది" అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు.

 

ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను గ్లోబల్ గేమ్ ఛేంజర్‌గా భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. "ఇంట్రానాసల్ వ్యాక్సిన్ టెక్నాలజీ, డెలివరీ సిస్టమ్‌లలో గ్లోబల్ గేమ్ ఛేంజర్ అయిన iNCOVACC ఆమోదాన్ని ప్రకటించినందుకు మేం గర్విస్తున్నాము. కోవిడ్-19 వ్యాక్సిన్‌లకు డిమాండ్ లేకపోవడం.. భవిష్యత్తులో వచ్చే అంటు వ్యాధుల కోసం ప్లాట్‌ఫారమ్ టెక్నాలజీలతో మేము బాగా సిద్ధంగా ఉన్నామని నిర్ధారించుకోవడానికి ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌లలో అభివృద్ధిని కొనసాగించాం.." అని ఆయన తెలిపారు. ఈ మహమ్మారి సమయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించామన్నారు. 

Also Read: Ruturaj Gaikwad: టీమిండియాకు ఎదురుదెబ్బ.. కివీస్ టీ20 సిరీస్ నుంచి రుతురాజ్ ఔట్  

Also Read: MLC Kavitha: గవర్నర్‌కు ధన్యవాదాలు చెబుతూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్.. ట్వీట్ వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News