Sanju Samson: సౌత్ ప్లేయర్ అని వివక్ష.. రిషబ్ పంత్ కోసం సంజూ శాంసన్ కెరీర్ నాశనం చేసిన బీసీసీఐ!
Sanju Samson was replaced by Deepak Hooda in IND vs NZ 2nd ODI. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంతో భారత మేనేజ్‌మెంట్‌పై ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BCCI ruined Sanju Samson Cricket Career for Rishabh Pant: కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిల్యాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శాంసన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి మ్యాచ్‌లో రాణించిన (38 బంతుల్లో 36 పరుగులు) శాంసన్‌కు చోటివ్వకుండా.. దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకుంది భారత టీమ్ మేనేజ్‌మెంట్. దాంతో సంజూ మరోసారి ఒక మ్యాచ్‌కే పరిమితం అయ్యాడు. హుడాను తీసుకోవాలనుకుంటే.. ఎన్నాళ్లుగానో ఫామ్‌లో లేని కీపర్ రిషబ్ పంత్‌ను తప్పించొచ్చు. ఆ అవకాశం ఉన్నా సరే టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం సంజూపైనే వేటు వేసింది.
ఈ ఏడాది సంజూ శాంసన్ బాగా రాణించాడు. అయినా కూడా అతడికి టీ20 ప్రపంచకప్ 2022 చోటు దక్కలేదు. ఆపై న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదు. దాంతో బీసీసీఐపై విమర్శల వర్షం కురిసింది. దాంతో కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో అవకాశం ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన సంజూ.. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అయినా కూడా రెండో వన్డేలో అతనికి జట్టులో చోటు దక్కలేదు. సంజూ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నట్లు టాస్ సమయంలో కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. రిషబ్ పంత్ తొలి వన్డేలో 15 పరుగులు చేసి ఔటవ్వగా.. శాంసన్ 36 పరుగులు చేశాడు. అయినా బీసీసీఐ సంజూపైనే వేటు వేసింది.
ఆల్‌రౌండర్ దీపక్ హుడాని తుది జట్టులోకి తీసుకురావాలనుకుంటే.. పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ని తప్పించొచ్చు. అలాగే సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్నా.. వన్డేల్లో మాత్రం అతడి రికార్డ్స్ పేలవంగా ఉన్నాయి. విఫలం అవుతున్న ఈ ఇద్దరినీ కొనసాగించిన భారత్.. సంజూ శాంసన్‌ను మాత్రం పక్కన పెట్టింది. శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంతో భారత మేనేజ్‌మెంట్‌పై ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్‌తో అభిమానులు రెచ్చిపోయారు. పంత్ కోసం శాంసన్ కెరీర్‌ను బీసీసీఐ నాశనం చేసిందని ఫాన్స్ మండిపడుతున్నారు.
భారత జట్టులో ఎవరు ఆడకపోయినా టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం సంజూ శాంసన్‌నే బలిపశువును చేస్తోందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. 'సంజూ శాంసన్ దక్షిణ సౌత్ ప్లేయర్ కావడం వల్లే బీసీసీఐ తుది జట్టులో చోటు ఇవ్వకుండా వివక్ష చూపిస్తోంది', 'పంత్ కోసం శాంసన్ కెరీర్‌ను బీసీసీఐ నాశనం చేసింది', 'అవకాశాల కోసం ఎదురుచూసే కంటే.. వేరే దేశానికి వెళ్లి ఆడడం ఉత్తమం', 'సంజూ శాంసన్‌కు న్యాయం చేయండి' అంటూ ఫాన్స్ బీసీసీఐపై మండిపడుతున్నారు. దాంతో #JusticeForSanjuSamson, #BCCIShameofyou అనే ట్యాగ్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
Also Read: IND vs NZ: హామిల్టన్‌లో భారీ వర్షం.. రద్దైన రెండో వన్డే! 1-0 ఆధిక్యంలో కివీస్
Also Read: Gautham Gambhir: భారత ఆటగాళ్లను తిట్టండి.. ఐపీఎల్‌పై ఆరోపణలు మాత్రం సరికాదు: గంభీర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.