IND vs NZ: హామిల్టన్‌లో భారీ వర్షం.. రద్దైన రెండో వన్డే! 1-0 ఆధిక్యంలో కివీస్

Heavy rain washes out India vs New Zealand 2nd ODI. హామిల్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌ భారీగా వర్షం కారణంగా రద్దైయింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 27, 2022, 01:11 PM IST
  • హామిల్టన్‌లో భారీ వర్షం
  • రద్దైన రెండో వన్డే
  • 1-0 ఆధిక్యంలో కివీస్
IND vs NZ: హామిల్టన్‌లో భారీ వర్షం.. రద్దైన రెండో వన్డే! 1-0 ఆధిక్యంలో కివీస్

India vs New Zealand 2nd ODI Abandoned Due To Heavy Rain in Hamilton: హామిల్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆదివారం ఉదయం ఆరంభం అయిన రెండో వన్డే మ్యాచ్‌లో వరుణుడు విజయం సాధించాడు. భారత్ ఇన్నింగ్స్‌ 12.5 ఓవర్ల వద్ద భారీగా వర్షం కురవడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఆటను రద్దు చేసే సమయానికి భారత్‌ 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. బుధవారం మూడో వన్డే జరగనుంది. 

వర్షం కారణంగా హామిల్టన్ మైదానం కాస్త చిత్తడిగా ఉండడంతో భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే టాస్‌ ఆలస్యమైంది. ఈ మ్యాచులో టాస్‌ నెగ్గిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. భారత ఇన్నింగ్స్‌ 4.5 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు మూడు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. మళ్లీ భారత ఇన్నింగ్స్‌ 12.5 వద్ద వరణుడు మరోసారి పలకరించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. 

వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో చివరికి అంపైర్లు భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దైయ్యే సమయానికి భారత్‌ 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. శుబ్‌మాన్‌ గిల్‌ (45), సూర్యకుమార్‌ యాదవ్‌ (34) క్రీజులో ఉన్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం (నవంబర్‌ 30)న క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే సిరీస్‌ 1-1తో సమం అవుతోంది. ఒకవేళ న్యూజిలాండ్‌ గెలిస్తే 2-0 తో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

Also Read: Gautham Gambhir: భారత ఆటగాళ్లను తిట్టండి.. ఐపీఎల్‌పై ఆరోపణలు మాత్రం సరికాదు: గంభీర్‌

Also Read: Samantha Health: అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సమంత.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News