IND vs NZ 2nd T20: రెండో టీ20లో టాస్ గెలిచిన కివీస్.. టీమిండియాలో కీలక మార్పు.. తుది జట్లు ఇవే..
IND vs NZ 2nd T20 Playing XI Out: మొదటి టీ20 మ్యాచ్ గెలిచిన కివీస్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. టాస్ గెలిచిన వెంటనే కెప్టెన్ శాంట్నర్ మరో ఆలోచన లేకుండా వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో కూడా ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది.
IND vs NZ 2nd T20 Playing XI Out: టీమిండియా కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. కివీస్ చేతిలో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్‌కు రెండో మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. లక్నో వేదికగా రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. లక్నోలో టీమిండియా ఆటగాళ్లు గట్టిపోటీ ఎదురుకానుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ అదే జట్టుతో బరిలోకి దిగుతుండగా.. టీమిండియా ఒక మార్పు చేసింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో స్పిన్నర్ చాహల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించింది.
'మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. కానీ బౌలింగ్ కూడా బాగానే ఉంది. మాకు ఎదురయ్యే సవాళ్ల గురించి ఇప్పటికే చర్చించాం. ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి గేమ్‌ను ఓడిపోయి.. ఆపై రెండు మ్యాచ్‌లను గెలవడం పెద్ద కష్టం కాదు. ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాను. గత మ్యాచ్‌లో కొన్ని తప్పులు చేశాం. వారిని సరిదిద్దుకుని బరిలోకి దిగుతున్నాం. జట్టులో ఒక మార్పు చేశాం. ఉమ్రాన్ మాలిక్ ప్లేస్‌లో చాహల్ జట్టులోకి వచ్చాడు. వాషింగ్టన్‌తో కలిసి మేం ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతున్నాం..' అని హార్ధిక్ పాండ్యా తెలిపాడు.
అంతకుముందు కివీస్ కెప్టెన్ శాంట్నర్ మాట్లాడుతూ.. ఈ పిచ్ టార్గెట్ ఛేదించడం అంతా ఈజీ కాదని తెలుసని అన్నాడు. 'మేము స్కోరు బోర్డుపై భారీ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాం. వన్డే సిరీస్‌ను కోల్పోయి.. టీ20 సిరీస్‌లో విజయంతో పుంజుకోవడం ఆనందంగా ఉంది. వేర్వేరు ఆటగాళ్లు వేర్వేరు సమయాల్లో అడుగు పెట్టడం ఎల్లప్పుడూ బాగుంది. స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంత సులభం కాదు. మొదటి మ్యాచ్‌లో సూర్య, హార్దిక్‌ల భాగస్వామ్యం వారిని మళ్లీ గేమ్‌లోకి తీసుకువచ్చింది. మధ్యలో వికెట్లు తీయడమే కీలకం..' అని చెప్పాడు.
తుది జట్లు ఇలా..
భారత్: శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాంప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఇష్ సోధీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
Also Read: Nandamuri Tarakaratna: నా గుండె పగిలిపోయింది.. తారకరత్న ఆరోగ్యంపై నారా లోకేష్ ఎమోషనల్
Also Read: Novak Djokovic: చరిత్ర సృష్టించిన నొవాక్ జోకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో విక్టరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి