Nara Lokesh Emotional Tweet on Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు బెంగుళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హాస్పిటల్ వద్దకు వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకుని.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. నందమూరి బాలకృష్ట ఆసుపత్రి వద్దే ఉంటూ అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మళ్లీ ఆరోగ్యంగా తిరిగిరావాలని పూజలు చేస్తున్నారు.
తాజాగా తారకరత్న ఆరోగ్యంపై తెలుగుదేశం నేత నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తారకరత్న తీవ్రమైన గుండెపోటుతో బాధపడటం చూసి నిజంగా నా గుండె పగిలిపోయిందంటూ రాసుకొచ్చారు. తారకరత్నతో తాను ఎప్పుడూ చాలా సన్నిహిత బంధాన్ని పంచుకున్నానని గుర్తు చేసుకున్నారు. తాను ఇటీవల ఆయనను కలిశానని.. జీవితం, సినిమాలు, రాజకీయాల గురించి చాలాసేపు మాట్లాడానని చెప్పారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని లోకేష్ అన్నారు.
I've always shared a very close bond with cousin Tarakarathna. Really broke my heart to see him suffer a massive heart attack. I met him recently and had a long chat about life, movies and politics.(1/2) pic.twitter.com/UuWOnNO0kC
— Lokesh Nara (@naralokesh) January 29, 2023
తారకరత్నను ఐసీయూలో ఉంచిన వైద్యులు.. ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే తారకరత్నకు మరో అరుదైన వ్యాధి కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆయనకు మేలేనా అనే వ్యాధి ఉందని వైద్యులు తెలిపారు. మెలేనా అనే వ్యాధి కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తారకరత్న ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారు.
తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని నందమూరి బాలకృష్ణ కోరారు. ఆరోగ్య పరిస్థితి నిన్నటికంటే మెరుగ్గా ఉందన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా.. నారా లోకేష్ తొలిరోజు యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొనగా.. సడెన్‌గా కుప్పకూలిపోయారు. వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే.
Also Read: India Post Office Recruitment 2023: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాలు.. టెన్త్ అర్హత.. డైరెక్ట్ జాబ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook