India vs New Zealand 2nd Test Day 2 Highlights: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ స్పిన్ దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్ విలవిలాడిపోయారు. 16-1 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. 156 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (30), శుభ్‌మన్ గిల్ (30) పర్వాదలేదనిపించగా.. వాషింగ్టన్ సుందర్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. శాంట్నర్ 7 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్ రెండు కీలక వికెట్లు తీశాడు. సౌథీకి ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 103 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. స్పిన్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీద్దామని భావించిన భారత్.. అదే స్పిన్‌ ఉచ్చులో పడిపోయి కష్టాల్లో పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో రోజు ఆట ఆరంభంలో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడారు. ఇద్దరు కివీస్ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను శాంట్నర్‌ విడదీశాడు. గిల్ (30)ను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కాసేపటికే విరాట్ కోహ్లీ (1)ని కూడా ఔట్ చేసి దెబ్బ తీశాడు. రిషబ్ పంత్ (18) కాసేపు క్రీజ్‌లో నిలబడ్డాడు. అయితే జైస్వాల్ (30), పంత్‌ ఇద్దరిని ఫిలిప్స్ ఔట్ చేయడంతో భారత్ భారీ కష్టాల్లో పడిపోయింది. తొలి టెస్టులో సెంచరీ హీరో సర్ఫరాజ ఖాన్ (11) కూడా తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు.


రవీంద్ర జడేజా (38) రాణించగా.. అశ్విన్ (4), ఆకాష్ దీప్ (6), బుమ్రా (0) వెంటవెంటనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ (18 నాటౌట్) క్రీజ్‌లో నిలబడ్డా.. అవతలి ఎండ్ నుంచి సహకరించేవారు కరువయ్యారు. 156 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ 259 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో 103 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.