IND VS NZ: భారత బౌలర్ల ధాటికి కివీస్ విలవిల్లాడింది. రెండో టెస్టు(IND VS NZ 2nd Test) మెుదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 62 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు అశ్విన్‌ (4/8), మహమ్మద్‌ సిరాజ్‌ (3/19) కివీస్(New Zealand) పతనాన్ని శాసించారు. కివీస్‌ బ్యాటర్లలో ఇద్దరు మినహా ఎవరూ రెండంకెల స్కోరును చేయలేకపోయారు. దీంతో టీమిండియా 263 ఆధిక్యంలో నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్(Ajaz Patel) పది వికెట్లు ఘనత నమోదుచేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IND vs NZ: సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక్


తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కివీస్ ఓపెనర్లు ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ భారత్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు. టామ్‌ లేథమ్‌ (10), విల్‌ యంగ్‌ (4), రాస్‌ టేలర్‌ (1)ను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపి మెుదటగా న్యూజిలాండ్ ను దెబ్బతీశాడు సిరాజ్. అనంతరం అక్షర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌ (8) ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు.అనంతరం రంగంలోకి దిగిన ఆశ్విన్(Ashwin) మిగతా వారి పనిపట్టాడు. ఆఖర్లో జేమీసన్‌ కాసేపు ప్రతిఘటించడంతో ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది కివీస్. సౌథీ, సోమర్‌విల్లే డకౌట్‌  అయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 4, సిరాజ్ 3, అక్షర్‌ 2, జయంత్‌ యాదవ్‌ ఒక వికెట్ తీశారు. భారత్‌లో ఏ పర్యాటక జట్టుకైనా అత్యల్ప స్కోరు ఇదే. ఇంతకుముందు వెస్టిండీస్ (75) తక్కువ పరుగులకే ఆలౌటైంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook