Mayank Agarwal: కివీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్(IND vs NZ 2nd Test Match)లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) సెంచరీతో అదరగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దశాబ్ద కాలంలో న్యూజిలాండ్(New Zealand)పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు మయాంక్. అంతకుముందు 2010లో అహ్మదాబాద్‌లో కివీస్ తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) సెంచరీ చేశాడు. ఆ తర్వాత టీమిండియా ఓపెనర్ ఎవరూ కూడా సెంచరీ సాధించలేదు.
Also Read: Ajaz Patel: టెస్ట్‌ల్లో భారత్‌పై అరుదైన ఘనత సాధించిన కివీస్ స్పిన్నర్
తాజాగా కివీస్‌పై మయాంక్ సెంచరీ సాధించి ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా న్యూజిలాండ్‌పై 2014 తర్వాత సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2014 లో ఆక్లాండ్ వేదికగా కివీస్‌పై శిఖర్ ధావన్ శతకం నమోదు చేశాడు. మయాంక్‌కు ఓవరాల్‌గా ఇది టెస్ట్‌ల్లో నాలుగో సెంచరీ. నాలుగు సెంచరీలు కూడా స్వదేశంలో చేసినవే కావడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook